రేవంత్ రెడ్డి కి సోనియా గాంధీ వార్నింగ్..!

0
416
telangana cm revanth reddy

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో ఎప్పటి నుండో అంతర్గతం గా రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఒక వర్గం రేవంత్ రెడ్డి కి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటూ వచ్చింది. ఆయన చేరిక సమయం నుండే కొంత మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులూ రేవంత్ రెడ్డి పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు శ్రీధర్ బాబు వంటి నాయకులూ కూడా ఉన్నారు.

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి, రేవంత్ రెడ్డి ని ముఖ్యమంత్రి చెయ్యబోతున్నారు అనే వార్త వచ్చినప్పటి నుండి ఈ ఇద్దరిలో తెలియని అసంతృప్తి నెలకొంది. కానీ పార్టీ హై కమాండ్ నుండి వచ్చిన ఆదేశాలు కచ్చితంగా పాటించాల్సిన అవసరం రావడం తో, ఎదురు తిరగలేక రేవంత్ రెడ్డి ని ఒప్పుకున్నారు. కానీ రేవంత్ తో పలు విషయాల గురించి చర్చలు జరిపి కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని అనుకున్నారు.

sonia attending cm revanth reddys oath

కానీ రేవంత్ రెడ్డి వీళ్లిద్దరి మాటలు వినే పరిస్థితి లో లేడు..దీంతో తీవ్రమైన అసంతృప్తి ని వ్యక్తం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు శ్రీధర్ బాబు నేరుగా ఢిల్లీ కి వెళ్లి సోనియా గాంధీ తో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ని దృష్టికి తీసుకొచ్చారు. వీళ్లిద్దరి వాదనలను పరిగణలోకి తీసుకున్న సోనియా గాంధీ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ని వాయిదా వేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు శ్రీధర్ బాబు ని బుజ్జగించి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి రేవంత్ రెడ్డి ని ముఖ్యమంత్రిగా ఒప్పించే ప్రయత్నం చేసారు.

హై కమాండ్ అంతలా చెప్పడం తో వీళ్లిద్దరు కూడా రేవంత్ రెడ్డి ని ముఖ్యమంత్రిగా ఒప్పుకున్నారు. కానీ రేవంత్ నుండి ఎదురు అవుతున్న పలు సమస్యలకు తమకి శాశ్వత పరిష్కారం కావాలని, లేకుంటే పార్టీ కి రాజీనామా చేస్తాం అని వీళ్లిద్దరు అనడం తో వారి సమస్యలను తెలుసుకున్న సోనియా గాంధీ, వెంటనే రేవంత్ రెడ్డి ని ఢిల్లీ కి పిలిపించి ఫుల్లుగా క్లాస్ పీకినట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

పార్టీ లోని సీనియర్ నాయకులను కలుపుకుంటూ పోవాలని, వారితో ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించుకునేలా ఉండాలి కానీ, సాగదీత ఉండకూడదని, మరోసారి ఉత్తమ్ కుమార్ మరియు శ్రీధర్ బాబు నుండి నీ మీద ఎలాంటి కంప్లైంట్ రాకూడదు అని చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారట. రేవంత్ రెడ్డి కూడా అందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. నేడు LB స్టేడియం లో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నాడు.