హరీష్ రావు పై విరుచుకుపడిన విజయ శాంతి!

0
281
vijayashanti on harish rao

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కొలువుదీరి పట్టుమని వారం రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పై విమర్శలు చెయ్యడం మొదలు పెట్టింది. మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రశ్నిస్తూ రైతుబంధు ఎప్పుడిస్తారు అంటూ రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి నిలదీశారు. దీనికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ హరీష్ రావు పై విరుచుకుపడ్డారు.వారిలో విజయ శాంతి కూడా ఒకరు.

ఈమె పూటకి ఒక పార్టీ మారుస్తూ వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు వరకు బీజేపీ లో కొనసాగిన విజయ శాంతి ఆ పార్టీ కి విజయ అవకాశాలు లేకపోవడం తో కాంగ్రెస్ పార్టీ లో చేరింది. కాస్త ముందుగా వచ్చి ఉంటే ఆమెకి ఎమ్యెల్యే స్థానం దక్కేదేమో, కానీ సరిగ్గా ఎన్నికల సమయం లో చేరడం తో ఆమెకి సీట్ దొరకలేదు.

vijayashanti on harish rao

తిరుగులేని శక్తులుగా మారిన మల్లా రెడ్డి, అల్లుడు

అదంతా కాసేపు పక్కన పెడితే ఈమె మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై చాలా తీవ్ర స్థాయిలో స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘పది సంవత్సరాలు అధికారం లో, ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ చేసి, 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసి వెళ్ళిందే కాకుండా, ప్రభుత్వం ఏర్పడి పట్టుమని వారం కూడా కాకముందే ఇచ్చిన హామీలను నెరవేర్చమని హరీష్ రావు గారు మాట్లాడడం చాలా హాస్యాస్పదం గా ఉంది.

విజ్ఞత మరియు బాధ్యతాయుత ధోరణితో వ్యవహరించే హరీష్ రావు నుండి ఇలాంటి వ్యాఖ్యలు రావడం నమ్మశక్యంగా లేదు. ఇది కచ్చితంగా ఆయన మాటలు కావు, వెనుకనుండి కేసీఆర్ మాట్లాడిస్తున్న మాటలే ఇవి. అయినా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతీ హామీ ని నెరవేర్చుకొని తీరుతుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కి కూడా త్వరలోనే అన్నీ విషయాల్లో సమాధానం దొరుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రతీ కార్యక్రమం జనాలకు తెలిసేలా చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చింది విజయశాంతి.

మరోపక్క ఇతర కాంగ్రెస్ నేతలు మరియు మంత్రులు కూడా హరీష్ రావు వ్యాఖ్యలను తిప్పికొట్టారు. రైతులకు వంద శాతం పెట్టుబడి ఇస్తామని చెప్పాము, గత ప్రభుత్వం ప్రతీ ఏటా డిసెంబర్ లో ఇచ్చేది, మేము కూడా అదే నెలలో ఇస్తాము అంటూ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తాము అంటూ చెప్పుకొచ్చారు.