పవన్ కళ్యాణ్ గుండు కథ సమాప్తం.. క్లారిటీ ఇచ్చిన పరిటాల శ్రీరామ్

0
681

హీరోలపై గాసిప్ లు సహజమే. అందుకే వారు ఎక్కువగా బయట ప్రపంచానికి దూరంగా ఉంటారు. సెలబ్రెటీలు కాబట్టి ఏదో ఒక వివాదంలో నిత్యం ఇరికిస్తూ వేడుక చేసుకుంటారు కొందరు రూమర్ రాయుళ్లు. అయితే వాటిని సదరు సెలబ్రెటీలు ఎక్కువగా పట్టించుకోరు. హద్దులు శృతి మించితే మాత్రం మీడియా వేదికగా ఒక క్లారిటీ వదులుతారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గుండు కథ

జానీ సినిమా కోసమేమో

పవన్ కళ్యాణ్ జానీ సినిమా తీస్తున్న రోజుల్లో కథకు సింక్ అయ్యే విధంగా గుండు కొట్టించుకున్నాడు. అప్పట్లో పవన్ గుండుపై చాలా రూమర్లు వినిపించాయి. అందులో పరిటాల రవే పవన్ కళ్యాణ్ కు గుండు కొట్టించాడని పెద్ద ఎత్తున గాసిప్స్ స్పెడ్ అయ్యాయి. పవన్ అన్న చిరంజీవికి పరిటాల రవికి ఓ భూ విషయంలో వివాదం రావడంతో అందులోకి చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ రావడంతో పరిటాల రవి పవన్ కళ్యాణ్ కు గుండు కొట్టించాడని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది.

అదంతా అబద్ధం

ఇది ఎంత వరకూ నిజమో అప్పట్లో చాలా మందికి తెలియదు కానీ దీనిపై పరిటాల రవి కొడుకు పరిటాల శ్రీరామ్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు. పరిటాల రవి పవన్ కళ్యాణ్ కు గుండు కొట్టించాడన్న వార్తలు పచ్చి అబద్ధమని పరిటాల రవి కొడుకు పరిటాల శ్రీరామ్ ఇటీవల జాఫర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. జాఫర్ పవన్ కళ్యాణ్ కు మీ తండ్రి గుండు కొట్టించాడట..? నిజమేనా..? అని శ్రీరామ్ ను ప్రశ్నిస్తే. అదంతా పూర్తిగా అబద్ధం మొత్తంగా కల్పించారు.

ఆయన ఇమేజ్ ను పాడు చేయాలని

పవన్ కళ్యాణ్ చాలా మంది వ్యక్తి. ఆయనతో మాట్లాడుతుంటే టైమే తెలియదు. వ్యవస్థను ఎంతో కొంత మార్చేందుకు నిత్యం పరితపిస్తుంటారు ఆయన. నేను కూడా ఆయన మూవీస్ చూస్తాను ఆయన అభిమానినే అనుకోండి మా నాన్న పరిటాల రవితో కూడా ఆయనకు మంచి స్నేహం ఉండేది. ఎలాంటి వార్తలు ఎలా స్పెడ్ అయ్యయో తెలియదు కానీ అదంతా పూర్తిగా అబద్ధం కావాలనే కొందరు ఆయన ఇమేజ్ ను పాడు చేయాలని చూస్తున్నారు. అయినా అలాంటి వారికి ఇలాంటివేమీ కొత్తకాదు. ఎన్ని రూమర్లు స్ప్రెడ్ చేసినా ఆయన ఎదుగుదలను ఎవరూ ఆపలేరని అన్నారు.

మళ్లీ వైరల్ అవుతున్న ఫొటోలు

అంటే పవన్ కళ్యాణ్ గుండు కథ ఇప్పటికి క్లారిటీ వచ్చిందన్న మాట. జాఫర్ కు శ్రీరామ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పటికి పూర్తి క్లారిటీ వచ్చిందనే చెప్పారు. ఇకపైన ఇలాంటి రూమర్లు వస్తే విని ఊరుకోవాలే తప్ప వాటిని స్ప్రెడ్ చేయవద్దన్నమాట. ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ విరోధులు కొందరు అప్పటి ఫొటోలను మళ్లీ తెరపైకి తీసుకువచ్చి నెట్ లో వైరల్ చేస్తూ చర్చలు మొదలు పెట్టారు. దీనిపై నెటిజన్లు కూడా తగు విధంగానే స్పందిస్తున్నారు. అప్పట్లో రోజా కూడా రాజకీయంగా పవన్ కళ్యాణ్ ను నిందిస్తూ గుండు గురించి ఆరోపించింది. కానీ దీన్ని మీడియా మాత్రం పట్టించుకోలేదు.