విక్టరీ ఫ్యామిలీ ఎలా ఉంది.. ఎప్పుడైనా తెలుసుకున్నారా?

0
591

విక్టరీ వెంకటేశ్ పెద్దగా పరిచయం అవసరంలేని పేరు. వందలాది బిగ్ హిట్లు ఇచ్చిన స్టార్ హీరో. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, హర్రర్, తదితర సినిమాలు తీసి ఆయన స్థానాన్ని వెండితెరపై పదిలం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలకు కూడా ఆయన పోటీగా నిలుస్తున్నారంటే ఆయన లెవలేంటో ఇట్టే అర్థమైపోతోంది. ఇప్పటి వరకూ ఆయన గురించి మనకు తెలుసు కానీ ఆయన కుటుంబం నేపథ్యం తెలియదు. ముఖ్యంగా ఆయన భార్య పిల్లల గురించి ఎవరికీ తెలియదు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కుటుబం గురించి

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల కుటుంబం గురించి చాలా వరకు అందరికీ తెలుసు. మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, అక్కనేని నాగేశ్వర్ రావు, తదితరుల కుటుంబం వారి పిల్లలు, ఇప్పుడు దాదాపుగా వారి మనుమళ్ల వరకూ కూడా సుపరిచితమే. కానీ ఇప్పటి వరకూ విక్టరీ వెంకటేశ్ పిల్లల గురించి ఇండస్ర్టీకి గానీ, ఆయన అభిమానులకు పెద్దగా తెలియదు. ఒక్క సన్నిహితులకు తప్ప. ఆయన తండ్రి రామానాయుడు, అన్నయ్య సురేశ్, సోదరి లక్ష్మి గురించి తెలుసు కానీ విక్టరీ వెంకటేశ్ భార్య, పిల్లల గురించి అంతగా తెలియదు. ఇప్పుడు ఇక్కడ వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఎలా ఉంటారు?

వెంకటేశ్ భార్య పేరు నీరజ, ఆమె ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మేన కోడలు. వీరి వివాహం 1985లో జరిగింది. వెంకటేశ్ నీరజకు నలుగురు సంతానం. పెద్ద కూతురు అశ్రిత, రెండో కూతురు హయవాహిని, చిన్న కూతురు భావన, ఇక కొడుకు అర్జున్ రామ్‌నాథ్. కూతురు అశ్రిత ఆమెకు వివాహం కూడా జరిగింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు అశ్రిత. ఆమె ఫలానా అని కొందరికే తెలుసు. ఆమె బిజినెస్ పై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం తన భర్తతో కలిసి రెస్టారెంట్లను నిర్వహిస్తున్నారు.

మూడో కూతరు విషయానికి వస్తే

ఇక రెండో అమ్మాయి హయవాహిని ఫ్యాషన్ డిజైనర్ గా రాణిస్తూ అందులో ప్రతిభ చూపుతోంది. ఇక మూడో కూతరు విషయానికి వస్తే ఈ మధ్యే చదువు పూర్తి చేసి క్రీడారంగం వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఆమెకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమట. ఇక చిన్నవాడు అర్జున్ ప్రస్తుతం చదువుకుంటున్నాడు. చదువు పూర్తయ్యాక ఇండస్ర్టీ వైపు వస్తాడని టాలీవుడ్ సినీ వర్గాలు చెప్తున్నాయి.