ఓటీటీలోకి కాంతారా.. సైలెంగా వచ్చిన మూవీతో సినీ ప్రేక్షకులు షాక్..

0
324

థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించిన ‘కాంతార’ మూవీ ఓటీటీలోకి ఎప్పుడూ అంటూ ఈ మధ్య విపరీతమైన గాసిప్ లు మొదలయ్యాయి. రిషబ్ శెట్టి దర్శకత్వంతో పాటు హీరోగా తీసిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది. తక్కువ వ్యవధిలోనే బాహుబలి, కేజీఎఫ్ లాంటి కలెక్షన్లను రాబట్టిందంటే ఈ మూవీ ఎంతటి క్రేజ్ సంపాదించిందో అర్థమవుతోంది. ఇందులో రిషబ్ సరసన సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. మూవీని కేవలం రూ. 15 కోట్ల ఖర్చుతో తెరకెక్కించగా, దేశ వ్యాప్తంగా రిలీజై అన్ని భాషల్లో కలిపి రూ. 400 కోట్ల వరకూ రాబట్టింది.

రెండు నెలలుగా ఎదురు చూపు

‘కాంతారా’ను థియేటర్లలో వీక్షించిన వారితో పాటు, చూడని వారు ఓటీటీ రిలీజ్ కోసం దాదాపు రెండు నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య చిత్ర యూనిట్ కూడా ఓటీటీ రిలీజ్ పై భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఇప్పుడు.. అప్పుడు.. అంటూ సాగదీతకు తెరపడినట్లయింది. మొదట కన్నడ చిత్రసీమలో విడుదలైన ఈ మూవీ విపరీతమైన టాక్ తెచ్చుకోవడంతో తెలుగు, తమిళ్, మలయాళం, హిందీలో అక్టోబర్ 15న పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేశారు.

రూ. 400 కోట్లు వసూళ్లు

పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ‘కాంతార’ ఇప్పటి వరకు ఏకంగా రూ. 400 కోట్ల వరకూ వసూళ్లు చేసి చిత్ర సీమను ఆశ్చర్యానికి గురిచేసింది. రిషబ్ శెట్టి నటనకు ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. కర్ణాటక సంప్రదాయమైన ‘భూత కోలా’ కాన్సెప్ట్ కు అందరూ కనెక్ట్ అయ్యారు. సూపర్ స్టార్ రజినీ కాంత్, కమల్ హాసన్, చిరంజీవి, అమితాబ్ లాంటి స్టార్ హీరోలతో సెభాస్ అనిపించుకున్నాడు రిషబ్ శెట్టి. మూవీ క్లైమాక్స్ బాగా ఆకట్టుకునేలా ఉందని ఇలాంటి పర్ఫర్మెన్స్ మరెక్కడా లేదని కొనియాడారు స్టార్స్.

ఓవర్ సీన్ లోనూ జోరు

సెప్టెంబర్ 30, 2022న ఈ మూవీ తెలుగు రాష్ర్టాలైన ఏపీ, తెలంగాణలో రూ. 60 కోట్లకి పైగా వసూళ్లను దక్కించుకుంది ఈ మూవీ. కర్ణాటకలో థియేటర్లలో దాదాపు కోటి మందికి పైగా ఈ మూవీని వీక్షించారు. దీంతో కన్నడలో రూ. 168 కోట్లు వసూళ్లు చేసింది. కేరళలో రూ. 19.20 కోట్లు, కోలీవుడ్ లో రూ. 12.70 కోట్లు, ఇక నార్త్ ఇండియా విషయానికి వస్తే రూ. 96 కోట్లు వసూళ్లు చేసింది. ఓవర్ సీన్ లోనూ రూ. 44.50 కోట్లను దక్కించుకోవడం విశేషం.

ఆకట్టుకున్న భూత కోల

కర్ణాటక ఆది సంప్రదాయం ‘భూత కోలా’ కాన్సెప్ట్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. అచ్చుత్ కుమార్ నెగెటివ్ రోల్ లో కనిపించగా, కిశోర్ ఫారెస్ట్ ఆఫీసర్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. మూవీలో అప్పుడప్పుడూ వచ్చే ‘ఓ’ శబ్ధంతో ప్రేక్షకులకు గూజ్ బంబ్స్ తప్పలేదు. ఈ మూవీకి మౌత్ పబ్లిసిటీ ప్లస్ పాయింట్ అయ్యింది. ఇంత మౌత్ సిటీ ఇటీవలి కాలంలో ఏ మూవీకీ రాలేదంటే అతిశయోక్తి కాదు. ఇక కాంతార మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ‘ఆమేజాన్ ప్రైమ్’లో నవంబర్ 24 నుంచి అందుబాటులో ఉంది. దీనికి ఓటీటీలో కూడా చూసేందుకు సినీ అభిమానులు విపరీతంగా ఆసక్తి కనబరుస్తున్నారు.