ఆ హీరోవల్లే పెళ్లికి దూరం.. తన జీవితంలో ఆ ఘట్టం

0
1167

మనసుకు నచ్చిన వారు పక్కనుండాలని కోరుకోవడం సహజమే. కానీ అలా జరగకుంటే జీవితాన్నే పనంగా పెట్టడం కొందరికే చెల్లుతుందోమో..! ఆ కోవలోకే వస్తుంది సీనియర్ నటి సితార. సితార కెరీర్ కొత్తలో బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూ దూసుకెళ్లారు. తెలుగు, తమిళం, మళయాలంతో పాటు ఇతర భాషా సినిమాలను కూడా చేస్తూ అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఆమె.

పెద్ద కుమార్తెగా బాధ్యతలు

కిలిమనూరులోని ఒక పరమేశ్వరన్ నాయర్ కుటుంబంలో పెద్ద కూతురిగా జన్మించారు సితార. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగులే. పెద్ద కుమార్తె కావడంతో అందరికీ ఆదర్శంగా ఉండాలని అనుకునేది సితార. డిగ్రీ వరకు వచ్చాక ఇండస్ట్రీలోకి వెళ్లాలని కలలు కన్నది. దానికి తగ్గ ప్రయత్నాలు చేసి డిగ్రీ చదువుతుండగానే తన తొలిచిత్రం ‘కావేరి’ చేసింది. ఆ చిత్రంలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు దక్కింది.

సినిమాలు, సీరియల్స్ లో బిజీ

సితార అంటేనే అందం, అభినయం. అప్పటి సినిమాల్లో చూపించే కనీక గ్లామర్ ను కూడా ఆమె చూపించలేదు. ఎంతో మంది విమర్శకుల మెప్పుపొందిన సితార గొప్ప తారగా ఇప్పటికీ గుర్తింపును నిలుపుకుంటుంది. ప్రస్తుతం తల్లిగా, వదినగా, అత్తగా పలు క్యారెక్టర్లలో ఒదిగిపోతూ మెప్పిస్తుంది ఈ సితార. వీటితో పాటు బుల్లితెరను కూడా అలరిస్తుంది. సీరియల్స్ లో విభిన్న పాత్రలు వేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. దాదాపు 47 సంవత్సరాలు ఉన్న ఆమె ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదన్న అనుమానాలు ఆమె అభిమానులతో పాటు సీని అభిమానులకు కలగడం సాధారణమే.. ఈ విషయంలపై నెట్టింట్లో విపరీతమైన గాసిప్ క్రియేట్ కావడంతో క్లారిటీ ఇచ్చారు సితార.

47 పడిలోనూ ఒంటిరిగా

30 సంవత్సరాల్లోపే పెళ్లి చేసుకునేవారు కొందరుంటే. వివాహానికి శాస్వతంగా దూరంగా ఉండేవారు మరికొందరు. ఇంకొందరైతే లివింగ్ లో ఉంటూ ఇది సరిపోతుందని అనుకుంటారు. సితార ఈ మూడింటికీ భిన్నంగా ఉన్నారు. దాదాపు 47 సంవత్సరాలైనా ఆమె ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదు. ఎవ్వరితోనూ లివింగ్ లో లేదు. అయితే అందుకు కారణం కూడా ఉందంటున్నారు సితార. ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఆమె కుమారిగానే మిగిలిపోవడానకి ఒక నటుడు కారణమట.

జీవితంలో అతన్ని కోల్పోయా

జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానని అందుకే వివాహ బంధానికి దూరంగా బతుకున్నట్లు క్లారిటీ ఇచ్చింది సితార. తమిళ నటుడు మురళీ. తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా చెప్పుకచ్చింది సితార. ఆయనంటే ఆమెకు విపరీతమైన అభిమానమట. ప్రాణస్నేహితుడు కూడా. ఆయన ఎవరో కాదు గద్దలకొండ గణేశ్ సినిమాలో నటించిన అధర్వ తండ్రి. ఆయన తమిళంలో సూపర్ స్టార్. 40 సంవత్సరాల వయస్సులోనే మురళి చనిపోయారు. ఆయన మరణం సితారను తీవ్రంగా కలిచివేసింది.

డీప్రెషన్ నుంచి బయటకు రావడానికి ఆమెకు చాలా సంవత్సరాలు పట్టాయట. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే మిగిలిపోయింది. తండ్రి మరణానంతరం తన గురించి పట్టించుకునేవారు లేరని. ఇద్దరు తమ్ముళ్లు సెటిలయ్యారని, తాను కూడా ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. ఇప్పుడైనా పెళ్లిపై ఆలోచిస్తారా అని జర్నలిస్ట్ అడుగగా ఇప్పుడు ఆ ఇంట్రస్ట్ లేదని చెప్పింది.