జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను అనుభవించా

0
283

ఎప్పుడూ పలు వివాదాల్లో ఉంటూ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు కరాటే కళ్యాణి. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా సంచనలమే అని చెప్పక తప్పదుమరి. తన వ్యక్తిగత జీవితంపై ఆమె ఇటీవల కొన్ని ఆసక్తికర సంఘటనలు చెప్పుకచ్చారు. సమాజం తనను ఎప్పుడూ వక్ర దృష్టితో చూస్తుందని కన్నీరు కార్చారు.

తన జీవిత భాగస్వామితో ఎన్నో కష్టాలు అనుభవించానని, ఆయన తాగుబోతు కావడంతో మాన్పించాలని ప్రయత్నాలు చేసి విఫలమయ్యానని చెప్పుకచ్చింది. ఎన్ని వేధింపులకు గురిచేసినా తట్టుకున్నానని, ఇక ఆయనలో మార్పు రాదని తెలుసుకొని డైవర్స్ తీసుకున్నానని చెప్పుకచ్చింది. ఇంకా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను చెప్పారు కరాటే కళ్యాణి.

ఒంటరిగా ఉండాలంటే భయం

‘నాకు ఒంటరిగా ఉండాలంటే భయం. మా నాన్న చనిపోయాక తమ్ముడు, అమ్మతో కలిసి ఉన్నాను. అమ్మ ఆరోగ్య రిత్యా హాస్పిటల్ లో ఉండగా నేను ఒంటరిగి ఇంట్లోనే ఉండేదాన్ని. తమ్ముడికి 27 సంవత్సరాలు వచ్చాక పెళ్లి చేశారు. తన ఆరోగ్యం బాగోలేదని, నీకు పెళ్లి చేస్తే బాధ్యత తీరుతుందని భావించిన అమ్మ నా పెళ్లి కోసం పట్టబట్టింది. దీంతో పెళ్లి తప్పలేదు.

తప్పుడు దృష్టితో చూడడం సరికాదు

అప్పట్లో సినిమాల్లో చేస్తున్న పాత్రలను బట్టి నన్ను చాలా మంది తప్పుడు దృష్టితో చూశారు. కానీ ఇప్పటికీ ఎలాంటి తప్పుడు పని చేయలేదు. వ్యక్తిగతంగా నాకు భక్తి ఎక్కువ. కానీ సమాజం నన్ను ఒక వ్యభిచారిలా చూస్తుంది. ఎందుకు అంటే సమాధానం ఇప్పటికీ కనిపించలేదు. ఒకరిపై ఆరోపణలు చేసేప్పుడు కనీస ఇంగిత జ్ఞానం ఉండాలని చాలా సార్లు అనుకునేదాన్ని.

జీవితంలో బతకాలంటే డబ్బు కావాలి. అందుకే నటిగా మారాను. నటులు వేసే పాత్రలతో వారి జీవితాన్ని డిసైడ్ చేయడం కరెక్టు కాదు. కృష్ణ, మిరపకాయ్ సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్, పని మనిషి క్యారెక్టర్ వేసినంత మాత్రాన నా జీవితాన్ని జడ్జ్ చేయడం కరెక్టుకాదు’. అంటూ చెప్పారు కరాలే కళ్యాణి.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్

ఎప్పటికీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆమె ఇటీవల ఒక యూట్యూబర్ ను రోడ్డుపై పరిగెత్తించి మరీ కొట్టారు. కరాటే కళ్యాణి తీరుతో ప్రముఖంగా వార్తల్లో నిలిచారు. దీంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు ఇద్దరిపై కేసులు పెట్టారు. తన గురించి చెడుగా చిత్రీకరించిన వారిని వదిలిపెట్టి తనపై కేసులు పెడతారా అంటూ ఆమె పోలీసులపై కూడా విరుచుకుపడ్డారు కళ్యాణి. దీంతో పాటు ఇటీవల ఆమె ఇంట్లో చైల్డ్ లేబర్ ఉందన్న సమాచారంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. ఇక మూవీ ఎలక్షన్ సమయంలో కూడా ఆమె ప్రత్యర్థులపై విరుచుకుపడిన తీరు పలు వివాదాలకు కారణమైంది. ఇలా ప్రతి విషయంలో ఆమె వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు.

వారికి కూడా ధీటుగా

ఆమె దూకుడు తగ్గించుకోవాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పలు సందర్భాలలో హెచ్చరించింది. వారి ఆరోపణలపై కూడా ఆమె ఘాటుగానే స్పందించారు. ఏది ఏమైనా తనకు వివాదాలు కొత్తేమి కాదంటుంది కరాటే కళ్యాణి.