అమీర్ ఖాన్ కూతురు పెళ్లి హైలైట్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం!

0
228

ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అమీర్ ఖాన్ పేరు కచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.

గత దశాబ్ద కాలం లో అమీర్ మేనియా బాలీవుడ్ లో ఎలా ఉండేది అంటే, అతను క్రియేట్ చేసిన రికార్డ్స్ ని కేవలం అతను మాత్రమే బ్రేక్ చేసేవాడు.

మిగిలిన ఖాన్స్ ఇద్దరు దరిదాపుల్లో కూడా ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. అమీర్ ఖాన్ కి వరుసగా రెండు ఫ్లాప్స్ వచ్చాయి.

ఈ గ్యాప్ లో షారుఖ్ ఖాన్ కం బ్యాక్ ఇచ్చి రెండు సార్లు వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకొని బాలీవుడ్ లో తన సత్తా చాటాడు.

కానీ అమీర్ ఖాన్ మాత్రం చాలా కాలం నుండి సినిమా షూటింగ్స్ కి దూరంగా ఉంటూ వస్తున్నాడు. కారణం అతని మొదటి భార్య రీనా కూతురు ఇరా ఖాన్ పెళ్లి ఉండడమే.

Bollywood Khans who cannot stand in front of Prabhas stamina

ఈమె రీసెంట్ గానే తన జిమ్ ట్రైనర్ తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. తల్లితండ్రులు విడిపోయారు అనే బాధలో చాలా డిప్రెషన్ ఫేస్ ని ఎదురు చూస్తూ వచ్చిన ఇరా ఖాన్ జీవితం లోకి నుపుర్ షికారే వచ్చిన తర్వాత సంతోషం గా ఉంటూ వచ్చింది.

అమీర్ ఖాన్ మరియు అతని మొదటి భార్య రీనా కూడా వీళ్లిద్దరి ప్రేమని అంగీకరించారు. గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు బాంద్రాలోని ఖరీదైన తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్ లో ఘనంగా వివాహం చేసుకోబోతుంది.

నిన్న జరిగిన హల్దీ ఫంక్షన్ లో ఈ జంట కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది.

ఒకరికోసం ఒకరు పుట్టినట్టుగా అనిపిస్తున్న ఈ జంట సౌత్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా నిలుస్తారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఈ వివాహానికి అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా తో పాటుగా, ఇటీవలే విడాకులు ఇచ్చిన మూడవ భార్య కిరణ్ రావు కూడా హాజరయ్యారు.

ఇక అమీర్ ఖాన్ అయితే చింపిరి జుట్టు తో , చాలా సాధారణమైన టీ షర్ట్ మరియు లుంగీ వేసుకొని ఈ హల్దీ ఈవెంట్ లో కనిపించడం అందరినీ ఆశ్చర్యపర్చింది.