‘వీరసింహారెడ్డి’ కవర్ సాంగ్ ఖర్చు ఎంతో తెలుసా..!

0
238

మూవీలో కవర్ సాంగ్ కు సినీ అభిమానులు పెద్దపీటే వేస్తారు. ఈ తంతు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ తో మొదలవగా ఈ మధ్య వస్తున్న వారంతా కొనసాగిస్తున్నారు. ఇందులో థమన్ కూడా ఒకరు. ‘అలవైకుంఠ పురం’లోని కవర్ సాంగ్ సంగీత ప్రియులను ఆకట్టుకోవడంతో పాటు మూవీకే హైలట్ గా నిలిచింది. దీని కోసం థమన్ లక్షలు ఖర్చుచేయించారు.

కవర్ సాంగ్ తో మూవీకి బలం

కవర్ సాంగ్ అనేది సినిమా రిలీజ్ కు ముందే జనాల్లోకి బలంగా వెళ్లి సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేస్తుంది. దీన్ని యంగ్ సంగీత దర్శుకులు మంచి అవకాశంగా కూడా తీసుకుంటున్నారు. మూవీలోని అన్ని పాటలకంటే కవర్ సాంగ్ పైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. ఇదే సంప్రదాయాన్ని ఎస్ థమన్ కొనసాగిస్తున్నారు. అల వైకుంఠపురం కవర్ సాంగ్ కు రూ. 25 లక్షల వరకూ ఖర్చు చేశారంట. దీనికంటే ఎక్కువ బడ్జెట్ తో వీరసింహారెడ్డి కవర్ సాంగ్ కు ప్లాన్ చేస్తున్నారు థమన్.

స్టార్ హీరోల సినిమాలకు ఎందుకు..

స్టార్ హీరోల సినిమాలకు ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదంటున్నారు సినీ విశ్లేషకులు. ఫ్యాన్స్ పరంగా బాలయ్య బాబుకు కొదువ లేదు. ఆయన ఉంటేనే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇక ఆయన సినిమాకు అలవైకుంఠపురం కంటే ఎక్కువ బడ్జెట్ తో కవర్ సాంగ్ తీసినట్లు తెలిసింది. ఈ మూవీలో ‘జై బాలయ్య’ అనే సాంగ్ కు ఎక్కువ బడ్జెట్ పెట్టడంపై నిర్మాతలు కొంచెం పెదవి విరుస్తున్నట్లు భోగట్టా.