బాహుబలి, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్‌ల సునామీ సృష్టిస్తోంది. విడులైన 6 రోజుల్లోనే 500 కోట్ల రూపాయలను కొల్లగొట్టి బాక్సాఫీస్ షేక్ చేస్తోంది.
బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన సాహో చిత్రం ఉత్తరాధిన బాగానే వసూళ్లు రాబట్టింది.
5 రోజుల్లో ‘సలార్’ రాబట్టిన వసూళ్లను చూస్తే మెంటలెక్కిపోతారు!
ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ అన్ని భాషల్లోనూ ఫ్లాప్‌టాక్ తెచ్చుకుంది. ఇంతకు ముందు వచ్చిన ఆదిపురుష్ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
ఈ కారణంగా ప్రభాస్ కెరీర్ కొంత డైలమాలో పడిరది. ఈ తరుణంలో దర్శకుడు ప్రశాంత్‌నీల్‌పై ఈ భారం మొత్తం పడిరది. యాక్షన్ చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కిస్తూ పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్‌నీల్ ప్రభాస్‌లోని బలాలు, బలహీనతలను బాగా కనిపెట్టాడు.
మళ్లీ ప్రభాస్ స్టామినా నిరూపించాలంటే ఎలాంటి సినిమా తీయాలో పర్‌ఫెక్ట్‌గా సెట్ చేసుకున్నాడు. ప్రభాస్ కటౌట్‌కు కంటెంట్ తోడైతే కలెక్షన్‌ల సునామీ సృష్టించవచ్చు అని సలార్‌తో నిరూపించాడు.
ఇండియన్ స్టార్‌హీరో షారూఖ్‌ఖాన్ నటించిన ‘డంకీ’ చిత్రం ఓవైపు సూపర్‌హిట్ టాక్‌తో నడుస్తుండగా, సలార్ దానికి ఏమాత్రం తీసిపోకుండా కలక్షన్‌ల వరద పారిస్తోంది.
కేవలం 6 రోజుల్లో వసూళ్ల మొత్తం 500 కోట్లు. ఇంకా ఈ సినిమా మంచి స్టాండిరగ్ రేంజ్‌లోనే ఉంది. దీనికి తోడు డిజిటల్ రైట్స్ కూడా ఊహించనంత పలుకుతుండడం నిర్మాతలకు కలిసొచ్చే అంశం.
ఓవరాల్‌గా క్లోజింగ్‌కు సమయానికి 1000 కోట్ల మార్కును సలార్ టచ్‌చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న మరో ప్రెస్టీజియస్ సినిమా ‘కల్కి 2898’. దీన్ని వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. నాగ్ అశ్విన్ కథానాయకుడు. ఇది సోషియో ఫాంటసీ చిత్రం.
ఇది కూడా దాదాపు 400 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. సందీప్ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ పేరుతో మరో సినిమా ప్రీప్రొడక్షన్‌లో ఉంది.
వీటి మధ్యలో మారుతి దర్శకత్వంలో ఓ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మొత్తానికి సలార్ తొలి భాగం సృష్టిస్తున్న కలెక్షన్ సునామీతో ప్రభాక్ అప్‌కమింగ్ చిత్రాల నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు.