ముంబై ని వణికిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలు..అసలు ఏమి జరుగుతుందంటే!

0
198
Tollywood star heroes shaking Mumbai

ఒకప్పుడు హిందీ సినీ పరిశ్రమకి సంబంధించిన వాళ్ళు మన టాలీవుడ్ ని, తెలుగు హీరోలను చాలా చిన్న చూపు చూసేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ హీరోలే ఆ చిత్ర పరిశ్రమ ని ఆదుకునే రేంజ్ కి వచ్చారు.

సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ సినిమాలు ఈమధ్య పెద్దగా ఆడడం లేదు. హృతిక్ రోషన్ రెండేళ్లకు ఒక సినిమా చేస్తూ ఉంటాడు. ఇక అజయ్ దేవగన్ మరియు అక్షయ్ కుమార్ వంటి హీరోలు ఫేడ్ అవుట్ అయ్యి చాలా కాలమే అయ్యింది.

ఒక షారుఖ్ ఖాన్ మరియు రణబీర్ కపూర్ మాత్రమే బాలీవుడ్ లో వరుసగా హిట్లు కొడుతూ బాక్స్ ఆఫీస్ ని శాసిస్తున్నారు. హీరోల కొరత అయితే వాళ్లకు బాగానే ఉంది.

అందుకే బాలీవుడ్ మార్కెట్ తో పాటుగా, సౌత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోలు మరియు డైరెక్టర్స్ చుట్టూ బాలీవుడ్ మేకర్స్ తిరుగుతున్నారు.

Salaar is raising dust with the collection of 500 crores

ముఖ్యంగా ప్రభాస్, రామ్ చరణ్ , ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. రీసెంట్ గా విడుదలైన ప్రభాస్ సలార్ చిత్రం , షారుఖ్ ఖాన్ డుంకీ చిత్రం తో పోటీ పడి గెలిచింది కూడా.

ఆ రేంజ్ డామినేషన్ ని మన తెలుగు హీరోలు చూపిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ తరచూ ముంబై విమానాశ్రయం కనిపిస్తూ ఉన్నారు.

వీళ్ళు విమానాశ్రయం కి వచ్చినప్పుడల్లా వీళ్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. అసలు ఇన్ని సార్లు వీళ్ళు ముంబై కి వెళ్ళడానికి కారణం ఏమిటి?..

రామ్ చరణ్ అయితే ముంబై లో ఒక్క ఇల్లు కూడా కొనుక్కున్నాడు. అంటే వీళ్ళు ఇక టాలీవుడ్ తో పాటు, సమానంగా బాలీవుడ్ మూవీస్ కూడా చేయబోతున్నారా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ పండితులు.

రామ్ చరణ్ అతి త్వరలోనే రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం లో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. అలాగే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 చిత్రం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు.

మరోపక్క అల్లు అర్జున్, ప్రభాస్ క్రేజీ పాన్ ఇండియన్ మూవీస్ లైన్ లో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బాలీవుడ్ ని రాబొయ్యే రోజుల్లో మన టాలీవుడ్ హీరోలు దున్నేయబోతున్నారు.