సంవత్సరానికోసారి శవాల్ని వెలికితీసి.. సంబరాలు చేసుకుని

    0
    943

    ‘‘పోయినోళ్లు అందరూ మంచోళ్లు.. ఉన్నోళ్లూ పోయినోళ్ల తీపి గురుతులు’’ అన్నారు మహాకవి ఆత్రేయ. మరణించిన వారి విషయంలో మనకు ఉండే భక్తి భావం అందరికీ తెలిసిందే. చనిపోయిన మన పెద్దలను ఏటేటా స్మరించు కోవడానికి సంవత్సరీకాలు అనే సంప్రదాయాన్ని పెట్టుకున్నాము. మన సంబంధీకులు చనిపోయిన రోజున సంత్సరానికి ఒకసారి వారిని స్మరించుకుంటూ మన మతాచారాల ప్రకారం అనేక కార్యాలు నిర్వహిస్తుంటాం. అయితే ఇండోనేషియాలోని ఓ గ్రామంలోని వారు అనుసరించే పద్ధతులు చూస్తే మతి పోవడమే కాదు.. జడుసుకుని పారిపోతాం కూడా. మరణించిన వారి విషయంలో వారు అనుసరించే పద్ధతులు అంత భయంకరంగా ఉంటాయన్నమాట.

    ఇండోనేషియాలో ‘రిందిగాల్లో’ అనే గ్రామం ఉంది. అక్కడ ఓ తెగకు చెందిన ప్రజలు చనిపోయిన తమ పూర్వీకుల సంవత్సరికాలను పురస్కరించుకుని వారి సమాధులను ప్రతి సంవత్సరం వెలికి తీస్తారు. అనంతరం వారి పార్థీవ దేహాలను రసాయనాలతో శుభ్రపరుస్తారు. వారికి ఇష్టమైన రంగు దుస్తులను, వారికి ఇష్టమైన ఆహారాన్ని, సిగరెట్‌లు, మద్యం వంటి వాటిని ఆ సమాధిలో ఉంచుతారు.

    ఆ పార్ధీవ దేహాన్ని తమ ఇంటికి తరలించి, మరణించిన వారు ఎక్కువగా ఎక్కడ కూర్చునే వారో అక్కడే కూర్చోబెట్టి మధ్యాహ్నం ఆ శవం ముందే కూర్చుని పిండి వంటలతో కూడిన భోజనాలు చేస్తారు. అనంతరం ఆట పాటలతో ఉల్లాసంగా గడుపుతారు. చీకటి పడే వరకూ ఈ తంతు కొనసాగుతుంది. చీకటి పడగానే గ్రామస్తుందరూ కలిసి మరల ఆ మృతదేహాన్ని సమాధిలోకి చేర్చి పూడ్చిపెట్టి త్లెవార్లూ అక్కడే ఏడుస్తూ కూర్చుంటారట. ఎవరి ఆచారాలు వారివి ఏం చేస్తాం.