నాగార్జున ‘శివ’తో ఓ నిండు ప్రాణం బలైంది.. సంచలన విషయాలు

0
513

వెండితెర మీద తమ అభిమాన నటులు ఏం చేస్తే ఫ్యాన్స్ కూడా అదే చేస్తారు. అందుకనే హీరోలు డైరెక్టర్ చెప్పిన స్ర్కిప్ట్ లోని కొన్నింటిని మారుస్తుంటారు. మనం వాటిని అర్థం చేసుకోకుండా హీరోలను కామెంట్ చేస్తుంటాం. హీరో అయిపోగానే సరిపోదు. వారిని అభిమానించే వారి గురించి కూడా పట్టించుకోవాలని కొన్ని సందర్భాలలో అది సాధ్యం కాకపోవచ్చు. విషయం తెలిశాక బాధపడక మానదు. అలాంటిదే ‘శివ’ సదర్భంగా జరిగిందట.

వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా

అందులో జరిగే ఒక సన్నివేసం ఒకరి ప్రాణం తీశాయంటే బాధపడక ఉండలేం. దీనికి సంబంధించిన కొన్ని విషయాలను ప్రొడ్యూసర్ ఇటీవల వివరించాడు. అవేంటో చూద్దాం. అక్కినేని నాగార్జున అంటే చిత్ర సీమకు పెద్దగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ స్థాయిలో నటించి మెప్పించారు. ఆయన ఇప్పుడు బిగ్ బాస్ కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రస్తానం చాలా ఒడిదుడుకులతో కూడుకుంది. ఆయన తండ్రి అక్కినేని నాగేశ్వర్ రావు ఇండస్ర్టీలో ఉండగానే నాగార్జున ఇండస్ర్టీకి వచ్చారు. తండ్రికి తగ్గ కొడుకుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

శివ ప్రస్థానం

ఆయన మొదటి సినిమా ‘విక్రమ్’ అది అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. తర్వాత వచ్చిన సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. దీంతో కెరీర్ లో ఇబ్బంది పడుతున్న ఆయనకు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా మంచి బ్రేక్ ను ఇచ్చింది. టాలీవుడ్ చరిత్ర పరంగా చూసుకుంటే శివకు ముందు, శివ తర్వాత ని చెప్పువచ్చు. శివ సినిమాకు ముందు ఇండస్ర్టీ మొత్తం మూసధోరణితో వెళ్లే సినిమాల నడక. శివ రీలీజ్ తర్వాత నడక మార్చుకున్నాయి. శివ సినిమాతో అప్పట్లోనే పాన్ ఇండియా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పరిచయం అయ్యాడు.

ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి చెప్పిన నిజాలు

రాంగోపాల్ వర్మ తన బయోగ్రఫీ ‘నా ఇష్టం’లో శివ సినిమా ప్రస్తానం గురించి చాలా వివరించాడు. అసలు పెద్ద కథ కూడా కాదని, సరైన స్క్రిప్ట్ లేకుండానే శివ తెరకెక్కించినట్లు చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాను చూస్తే దీన్ని డైరెక్ట్ చేసింది రాంగోపాల్ వర్మేనా అంటూ నోరెళ్ల బెట్టక మానదు. ఎందుకంటే అప్పటి ట్రెండ్ ను సెట్ చేసేందుకు ఆయన ఈ మూవీని తీశారు. అది ప్రభంజనం సృష్టించింది. బాక్సాఫీస్ ను ఆడుకుంది. దీంతో నాగార్జునకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తర్వాత ఆయన హిట్ల పరంపర కొనసాగిస్తూనే వచ్చారు.

‘శివ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్

రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘శివ’ సినిమాకి ప్రొడ్యూసర్ గా ప్రవీణ్ రెడ్డి వ్యవహరించారు. ఈ సినిమాను చూసి ఒకరు చనిపోయారు అంటూ సంచలన విషయం ఒకటి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన మాట్లాడుతూ ‘శివ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్, మూస ధోరణితో సాగిన సినిమాలను ఈ మూవీ పూర్తిగా మార్చివేసింది. గుంటురులో మూవీకి సంబంధించి హక్కులను తామే కొనుగోలు చేశాం. థియేటర్ లో మొదటి రోజు మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది శివ.

‘గీతాంజలి’ సైలెంట్ హిట్’

అందులో నాగార్జున సైకిల్ చైన్ తెంపే సీన్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. ఈ సినిమా చూసి వచ్చిన కాలంలో ఒక గ్యాంగ్ వార్ జరిగింది. ఇందులో ఒకరు ఇలాగే చైన్ ఉపయోగించడంతో బాధితుడు బలై పోయాడు. ఆత్మకూరులో చైన్ తో ఒకరిని మర్డర్ చేశారు అని చెప్పారు. దీంతో పాటు చాలానే జరిగాయి. ఈ మూవీని చూసిన చాలా మంది నాగార్జునను ఫాలో అయ్యారు. ఈ చిత్రం జనాల మనసులో అంత క్రేజ్ ఏర్పరుచుకుంది. నాగార్జున తర్వాతి మూవీ మణిరత్నం తీసిన ‘గీతాంజలి’ సైలెంట్ హిట్’ అని చెప్పారు ప్రవీణ్ రెడ్డి.