హీరోయిన్ల జబ్బులకు అదే కారణమా..!? ఇండస్ర్టీలో అసలేం జరుగుతోంది..?

0
564

మహానటి సినిమాలో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్న: మీరు వంటలు బాగా వండుతారట..? సావిత్రీ చెప్పిన సమాధానం: అవును బాగా తింటాను కూడా.. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకున్నాం అంటే గతంలో హీరోయిన్లు బొద్దుగా ఉండేవారు. వారు ఎక్కువగా నటన, అభినయం, వాక్ చాతుర్యం, డ్యాన్స్ తదితరాల పైనే దృష్టి పెట్టేవారు. అయినా అప్పటి వారికి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకుంటే సావిత్రీ, జయమాలిని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉంటారు. వీళ్లకు బాడీ షేమింగ్ గురించి తెలియదు.

యంగ్ హీరోయిన్ లకే ఎందుకు

హీరోయిన్ పాత్రకు తగ్గట్లుగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఆయురారోగ్యాలతో (మద్యానికి బానిసలుగా మారడం, ఆత్మహత్యలు చేసుకోవడం మినాహిస్తే) ఉండేవారు. అప్పటి వారు ఇప్పటి కూడా ముదుసలి వారిగా ఉన్నారు. ఈ మధ్య సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లు, హీరోలు వరుసగా వ్యాధుల భారిన పడుతున్నారు. ఇందులో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్స్ ఎక్కువగా రోగాల భారిన పడుతున్నారు. అసలు హీరోయిన్సే ఎందుకు వ్యాధులకు గురవుతున్నారు. అది కూడా దీర్ఘకాలిక వ్యాధులకు అంటూ వారి అభిమానుల్లో చర్చ మొదలైంది.

నీటిని మాత్రమే తాగడం

ఇందులో భాగంగానే ఒక విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. చిత్ర సీమ అంటేనే గ్లామరస్ వరల్డ్. గ్లామర్ గా కనిపించకుంటే ఇక్కడ ఎవరూ పట్టించుకోరు. అలా కనిపించేందుకు హీరోయిన్స్ వింత వింత పోకడలను అవలంభిస్తుంటారు. డైట్ అంటూ కడుపు మాడ్చుకోవడం. వాటర్ డైట్ అంటూ నీటిని మాత్రమే తాగడం, ప్లాంట్ బేసిడ్ డైట్ అని కేవలం ఆకు కూరలు మాత్రమే తినడం, లిక్విడ్ డైట్ అని వాటర్, లేదా జ్యూస్ లను మాత్రతే తీసుకోవడం చేస్తుంటారు. ఇది మొదటికే మోసం తెస్తుందని న్యూట్రిషనిస్టులు చెప్తున్నా పట్టించుకోరు.

జీరో సైజ్ ఇంట్రస్ట్

సరైన పోషకాలు లేకుంటే బాడీ పని చేయదని, శరీరానికి కావాల్సిన అన్ని పదార్థాలు సమపాలల్లో తీసుకోవాలని సూచిస్తున్నా వారు పెడచెవిన పెడతారు. అందుకే ఇలాంటి వ్యాధులు వీరికి వస్తున్నాయి అంటూ వైరల్ చేస్తున్నారు. చాలా కాలం నుంచి సీనీ ఇండస్ర్టీలో జీరో సైజ్ పై విభిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. గతంలో కొందరు హీరోయిన్లు జీరో సైజ్ అంటూ పెట్టిన ఫొటోలను కొందరు వైరల్ చేసి ఇది బాడీకి మంచిది కాదంటూ కామెంట్లు పెట్టారు. కానీ వాటిని హీరోయిన్లు పట్టించుకోవడం లేదు.

న్యూట్రీషనిస్టులు మొత్తుకుంటున్నా

జీరో సైజ్ అంటూ ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా మానేస్తున్నారు. యోగాలు, ఎక్సర్ సైజులు చేస్తూ జీరో సైజ్ మెయింటెన్ చేస్తున్నారు. అయితే జిమ్ నిర్వాహకులు కూడా వారికి ఎక్సర్ సైజ్ చేసేందుకైనా బలం కావాలి కాబట్టి ఆహారం తీసుకోవాలని సూచనలు చేస్తున్నా పట్టించకోవడం లేదట. ఏదైనా ఒక మోతాదు తీసుకోవచ్చు. మోతాదుకు మించితే అది మంచిది కాదు అంటున్నారు. శరీరానికి సరైన ప్రొటీన్స్, విటమిన్స్ ఇస్తేనే అందం కూడా బాగుంటుందని న్యూట్రీషనిస్టులు కూడా మొత్తుకుంటున్నా వారు వినిపించుకోవడం లేదట.

బ్యూటీలే ఎక్కువగా

ఈ మధ్య జబ్బల భారిన పడిన హీరోయిన్లు ఇండస్ర్టీలో చాలా అందగత్తెలు. వారు జబ్బుల భారిన పడేందుకు కారణాలను ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెప్తున్నారు. సమంత విషయంలో చైతూతో డైవర్స్ అయ్యాక డీప్రెషన్ కు గురై సరిగా తిండిలేక తీవ్రంగా జిమ్ లో వర్కవుట్లు చేస్తూ కండరాల వ్యాధి తెచ్చుకుంది అంటున్నారు. ఇది ఎంతవరకు కరక్టో ఎవరికీ తెలియదు. అప కమింగ్ యంగ్ హీరోయిన్స్ అయినా ఇలాంటివి పాటించకుండా చక్కగా తింటూ ముద్దుగా, బొద్దుగా ఉండాలని నెటిజన్లు సూచనలు చేస్తున్నారు.