విలన్ గా చేసిన బాడీ బిల్డర్ షేక్ శ్రీను గురించి తెలుసా

0
337

సినిమాకు హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ముఖ్యం. గతంలో కంటే ఇప్పటి విలన్లను హీరోకు సమానంగా సెలక్ట్ చేస్తున్నారు. బాహుబలినే తీసుకుంటే ప్రభాస్ హైట్ వెయిట్ కు తగ్గట్టుగా రాణాను సెలక్ట్ చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. అప్పట్లో విలన్ ఆయన పక్కన ఉండే వారిని కూడా మంచి శారీర దృఢత్వం కలిగిన వారిని తీసుకునే వారు అందులో భాగంగానే వచ్చిన సైడ్ విల్ షేక్ శ్రీను.

సైడ్ విలన్ గుర్తింపు

సినిమాలో హీరో, హీరోయిన్లతో పాటు విలన్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తారు. అయితే వీరితో పాటు మేయిన్ రోల్ పక్కన నటించే వారు కూడా ఒక్కోసారి హైలట్ అవుతుంటారు. అదే కోవకు చెందిన వారు షేక్ శ్రీను. ఈయన చాలా సినిమాల్లో సైడ్ విలన్ గా నటిస్తూ వచ్చారు. బహూషా ఈ పేరు టాలీవుడ్ లో చాలా మందికి తెలియదనే చెప్పాలి. తన ఫొటోను చూస్తే మాత్రం గుర్తించే వారు కొందరు ఉంటారు.

నేషనల్ అవార్డు కైవసం

షేక్ శ్రీను నటనతో పాటు బాడీ బిల్డింగ్ తో కూడా ఆకర్షించే వారు. ఆయన బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షేక్ శ్రీను అసలు పేరు షేక్ రహమాన్. ఆయనకు చిన్నతనం నుంచి బాడీ బిల్డింగ్ అంటే చాలా ఇష్టమట. ఆ కోరికతోనే జిమ్ లలో బాగా కసరత్తు చేసే వారట. తాను అనుకున్ విధంగా బాడీ మారడంతో బాడీ బిల్డింగ్ పోటీల్లో కూడా పాల్గొన్నారు శ్రీను (రహమాన్). అలా బాడీ బిల్డింగ్ లో నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారట.

నరసింహ నాయుడుతో ఇండస్ర్టీలోకి

బాడీ బిల్డింగ్ తో పాటు చిన్నతనం నుంచి సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆయన తెగ అభిమానించే వారట. దీంతో ఆయనకు సినిమాలపై ఇంట్రస్ట్ పెరిగింది. జాకీచాన్, అర్జున్ లాంటి వారిని చూసి మరింత ఇన్స్పైరై ఇండస్ర్టీలోకి రావాలని చాలానే కష్ట పడ్డారట. తనకు పరిచయం ఉన్న ఆర్టిస్ట్ ప్రసన్న కుమార్ కు ఈ విషయం చెప్పడంతో ఆయన ఇండస్ర్టీలోకి తీసుకచ్చేందుకు పలువురు పెద్దలను కలిసారట. దీంతో శ్రీను టాలీవుడ్ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇండస్ర్టీలోకి వచ్చిన తర్వాత ఆయన పేరును షేక్ శ్రీనుగా మార్చుకున్నాడట. ఈ విషయాలను ఆయన స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బాలయ్య బాబు హీరోగా నటించిన ‘నరసింహ నాయుడు’ చిత్రంలో మొదటి సారి కనిపించారు శ్రీను.

సబ్ ఇన్ స్పెక్టర్ గా ఉద్యోగం

అంతటి ఫేమస్ స్టార్ బాలయ్య బాబు సినిమాలో నటించిన శ్రీనుపై ఫైట్ మాస్టర్స్ రాం-లక్ష్మణ్ కళ్లు పడ్డాయి. ఇంకే ముంది అప్పటి నుంచి వరుస పెట్టి సినిమాల్లో ఆఫర్లు వచ్చాయట. భద్ర, ఆప్తుడు, జయ జానకీ నాయకా, మిర్చి వంటి చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు షేక్ శ్రీను. ఆయన నటనతో పాటు ఉద్యోగం కూడా చేస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. అది కూడా మామూలు ఉద్యోగం కాదు ఏకంగా పోలీస్ డిపార్ట్ మెంట్ లోనే. షేక్ శ్రీను ప్రస్తుతం వైజాగ్ లోని సబ్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.