నాగార్జున-బాలకృష్ణ మధ్య మరోసారి తలెత్తిన వివాదాలు

0
1324

‘ఎంచుకున్న రంగంలో రాణించాలంటే పోటీ తత్వం ఉండాల్సిందే. కానీ అది శత్రుత్వంగా మార్చుకోవద్దంటూ’ హెచ్చరిస్తుంటారు పెద్దలు. సాధారణంగా ఇండస్ర్టీలో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు ఇలా వారు ఎంచుకున్న రంగంలో సరిసమానమైన ప్రత్యర్థులతో ఒక్కోసారి పోటీతత్వం ఏర్పడుతుంది. ఇంత పెద్ద రంగుల ప్రపంచంలో ఇది కామనే. కానీ ఈ స్టార్ హీరోలు మాత్రం దాదాపు 9 సంవత్సరాలుగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే మానేశారట.

వీరికి ఎక్కడ వైరం ఏర్పడిందో ఇప్పటికీ ఇండస్ట్రీలో ప్రశ్నగానే మిగిలింది. వీరి తండ్రులు మాత్రం మంచి స్నేహితులు కావడం విశేషం. ఎన్టీఆర్, అక్కినేని సమకాలంలో పని చేసినా ఒకరిపై ఒకరికి గౌరవం మర్యాదలు విపరీతంగా ఉండేవి. కానీ బాలకృష్ణ నాగార్జున మాత్ర ఇన్నేళ్లు మాట్లాడుకోకుండా ఉన్నారు.

కలవని ఇండస్ట్రీ సార్లు

నాగార్జున-బాలకృష్ణ మధ్య దూరం చాలా సందర్భాల్లో బయటపడింది. నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వర్ రావు చనిపోయిన సందర్భంలో కడసారి చూపునకు బాలకృష్ణ రాలేదు. అటు తర్వాత అక్కినేని నాగేశ్వర్ పేరు మీద నిర్వహించిన ఓ కార్యక్రమానికి నాగార్జున బాలకృష్ణను పిలవలేదు. దీంతో ఇప్పటి వరకూ వీళ్ల ఇద్దరి ఇళ్లలో ఒకరింట్లో ఫంక్షన్ కు మరొకరు వెళ్లినట్లు కనిపించదు కూడా. కానీ నాగ చైతన్య ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ‘జోష్’ సినిమా ప్రమోషన్ ఈవెంట్ కి బాలకృష్ణ గెస్ట్ గా వచ్చారు. ఇది తప్ప ఇప్పటి వరకూ వీరికి సంబందించిన ఏ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొనలేదు.

ఒక సందర్భంలో కలుసుకున్న స్టార్ హీరోలు

గతంలో ఓ సినీ ప్రముఖుడు తన నివాసంలో పార్టీ ఇచ్చిన సందర్భంలో నాగార్జున, బాలకృష్ణను ఆహ్వానించారు. ఈ పార్టీకి ఇద్దరూ వెళ్లారు. ఆ సందర్భంలో ఇద్దరినీ సన్నితులు కొన్ని ప్రశ్నలు వేశారు. మీ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయట నిజమేనా..? మీరు కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుకోవడం లేదట..? అంటూ అడగడంతో ఇద్దరూ ఒకరికొకరు పలకరించుకున్నారు.

షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకున్నారు. కానీ ఏదో లోకం కోసం అన్నట్లుగా ఉన్నారు కానీ ఇద్దరి మొహంపై చిరునవ్వు కూడా లేదు. అదటుంచితే ఈ మధ్య మరో సంఘటన కూడా వీరి మధ్యలో ఎంత దూరం తెలుపుతుంది. దాని గురించి తెలుసుకుందాం.

బాలకృష్ణ షరతు

నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు 4 సీజన్లను ఆయన విజయవంతంగా నిర్వహించారు. అయితే బిగ్ బాస్ సీజన్ 7కు హోస్ట్ గా కొత్తవారు వస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఇందులో భాగంగానే బిగ్ బాస్ టీం కొందరిని సంప్రదించింది. అందులో ‘అన్ స్టాపబుల్’ను విజవంతంగా నిర్వహిస్తున్న బాలకృష్ణ కూడా ఉన్నారు. బిగ్ బాస్ హోస్ట్ గా రావాలని టీం ఆయనను ఇటీవల సంప్రదించిందట.

అయితే ఆయన ఒక షరతు పెట్టారట. బిగ్ బాస్ 7 హోస్ట్ గా వస్తాను కానీ సెట్ ను అన్నపూర్ణ స్టూడియో నుంచి మార్చాలని సూచించారట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. బాలకృష్ణ షరతుతో వాళ్ల మధ్యా దూరాన్ని మళ్లీ చెప్పకనే చెప్పినట్లు తెలుస్తుంది.