డబ్బు కోసమే చేస్తున్నా.. సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..!

0
516

టాలీవుడ్ ఇండస్ర్టీలో పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన సినిమాలో ఉంటేనే గ్రేట్ హైప్ ఉంటుంది. తెలుగు ఇండస్ర్టీలో ఫ్యాన్ ఫాలోయింగ్ లో కూడా ఆయన అగ్రస్థానంలో ఉన్నారు. మొదటి సినిమా నుంచి కొత్త కొత్త కథలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. ఆయన సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో కూడా క్రియాశీలంగా పని చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఆయన కీలక భూమిక పోషిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

వేగంగా జరుగుతున్న షూటింగ్స్

పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక వైపు ఏపీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అప్పటిలోగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆయన డైరెక్టర్లు, నిర్మాతలకు కూడా చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఇటీవల ఒక ఫైట్ సీన్ ను అధిక బడ్జెట్ తో షూటింగ్ చేశారు. ఇది టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ కలిగిన ఫైట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెప్తుంది.

పవన్ ను వేధిస్తున్న వింత ప్రశ్న

పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇటీవల చిరంజీవి చెప్పినట్లు ‘రాజకీయాల్లో రాణించాలంటే మాటలు పడేందుకు సహనం ఉండాలి మాటలు అనేందుకు ధైర్యం ఉండాలి’ అన్న విషయాలు పవన్ కళ్యాణ్ విషయంలో నిరూపితమయ్యాయి కూడా. ఇటు సినిమాలు తీస్తూనే రాజకీయాల్లో కూడా రాణిస్తుండడంపై కొందరు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ మధ్య కొందరు సోషల్ మీడియా వేధికగా పవన్ కళ్యాణ్ ను ఒక ప్రశ్న అడిగారు.

విమర్శలపై పవన్ క్లారిటీ

‘మీరు రాజకీయాల్లోనైనా ఉండడం.. సినిమాల్లో ఉండడం.. ఎందుకు ఒక్కదాంట్లో ఉండచ్చు కదా అని’ దీనిపై ఆయన ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ఆయనపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. తాను సినిమాలు చేస్తుంది డబ్బు కోసమే అని.. అయితే రాజకీయాలు మాత్రం ప్రజల కోసమే.. వారి క్షేమం కోసమే చేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ విమర్శలకు బ్రేక్ పడ్డట్లే అయ్యింది. ఎవరిపైనో ఆధారపడుతూ పార్టీని నడిపించడం తనకు ఇష్టం లేదని పార్టీని నడిపించేందుకు డబ్బులు కావాలి కాబట్టి సినిమాల్లో సంపాదిస్తున్నానని ఆయన చెప్పారు.

ఎన్నికల్లో ఖర్చుల కోసం

ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఒక్కో ప్రాజెక్టుకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఆయన సినిమాలలో సంపాదించిన డబ్బులను వచ్చే ఎన్నికల్లో ఖర్చుల కోసం ఉపయోగిస్తానని చెప్పారు. అయితే కొందరు నిర్మాతలతో సినిమాలకు కమిట్ అయిన పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ లోపలే వీటిని పూర్తి చేయాలని చెప్పడంతో వారిలో కొంత ఆందోళన మొదలైంది. ఇప్పటికే షూటింగ్ ముగించేసుకొని విడుదలకు సిద్ధం కావాల్సిన హరిహర వీరమలు ఇంకా పూర్తి కాలేదు.

దీంతో మిగతా ప్రాజెక్టులు సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తాయని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత అయినా మీ ప్రాజెక్టులు పూర్తి చేస్తానని పవన్ కళ్యాణ్ మాటివ్వడంతో వారు కూడా కొంచెం వరకూ ఆనందంగానే ఉన్నారట.