శుభశ్రీ, టేస్టీ తేజలు కుర్చీని మడత పెట్టేసారు

0
187
Subhasree and Tasty Tejalu folded the chair

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రానికి సంబంధించిన కుర్చీని మడత పెట్టి.. అనే సాంగ్ ఇప్పటికే మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

ఇప్పటికే ఈ పాటకి హీరో మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీల వేసిన స్టెప్స్ అభిమానులని అలరిస్తున్నాయి. సోషల్ మీడియా లో పాపులర్ అయిన కుర్చీ తాత డైలాగ్ ని మహేష్ ఏకంగా తన సినిమాలో వాడడం విశేషం.

ఈ పాటకి ఇప్పటికే సోషల్ మీడియా లో మంచి పాపులారిటీ వచ్చింది. కొత్త సంవత్సరం వేడుకల్లో ఎక్కడా చూసినా ఈ పాటే వినిపించింది. దీనితో నెటిజన్స్ కూడా ఈ పాటకి రీల్స్ చేయడం చేస్తున్నారు.

ఇక ఈ పాటకి తాజాగా బిగ్ బాస్ ఫేమ్ సెలబ్రిటీలు కూడా డాన్స్ చేయడం విశేషం. తాజాగా బిగ్ బాస్ సీజన్ కి సంబందించిన శుభశ్రీ, టేస్టీ తేజ లు ఈ పాటకి డాన్స్ చేయడం విశేషం. ఈ ఇద్దరూ కలసి కుర్చీని మడత పెట్టి రెచ్చి పోయి డాన్స్ చేశారు.

ఇప్పకికే బిగ్ బాస్ షో ధ్వారా అనేక మంది పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ షో వలన అనేక మంది సోషల్ మీడియా స్టార్లు..

Guntur Karam sensor talk Do you know how it is

సిల్వర్ స్క్రీన్ పై అవకాశాలు సంపాదించుకున్నారు. అందులో భాగంగా తాజా బిగ్ బాస్ ధ్వారా మరి కొందరు సెలబ్రిటీ హోదాని సంపాదించుకున్నారు.

అయితే టేస్టీ తేజ బిగ్ బాస్ కన్నా ముందే జబర్దస్త్ ధ్వారా పాపులర్ అయ్యాడు. తన టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్ తో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు.

బిగ్ బాస్ లో ప్రేక్షకులకి మరింత దగ్గర అయి.. టివి ప్రేక్షకులని అలరించాడు. అయితే శుభశ్రీ మాత్రం బిగ్ బాస్ కి ముందు పెద్దగా ఎవరికీ తెలియదు.

కేవలం బిగ్ బాస్ ధ్వారానే ఈ భామ పేరు సంపాదించుకుంది. మనోభావాలు దెబ్బ తిన్నాయి బ్రో అనే డైలాగ్ తో ఆమె పాపులారిటీ సంపాదించుకుంది. ఇక వీరు ఇద్దరూ ఇప్పుడు మహేష్ బాబు పాట కి స్టెప్పులు వేసి..

మరో సారి సోషల్ మీడియాని ఊపేసారు. ఏమైనా ఈ చలికాలంలో కుర్చీని మడతపెట్టి శుభశ్రీ, టేస్టీ తేజలు వేడి పుట్టించేసారు.