నళిని పై రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు

0
423
nalini dsp revanth reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో అడుగడుగునా తన మార్కుని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఆయన తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వెనుక ఎంతో ఆలోచన, పారదర్శకత ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంతే కాదు ఇతర ముఖ్యమంత్రులు లాగ రాజభోగాలు అనుభవించకుండా, ప్రభుత్వ ఖజానా కి సంబంధించిన డబ్బుని అనవసరమైన వాటికి వినియోగించకుండా, కేవలం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇకపోతే లేటెస్ట్ గా ఆయన పోలీస్ మరియు వైద్య శాఖల మీద సమీక్షని ఏర్పాటు చేసాడు. ఈ సమీక్ష లో మాజీ పోలీస్ అధికారిణి నళిని ప్రస్తావన వచ్చింది. ఈ అంశం పై అధికారులతో చర్చించిన రేవంత్ రెడ్డి వెంటనే ఆమెని మళ్ళీ ఉద్యోగం లోకి తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించాడు. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

nalini dsp revanth reddy

కేసీఆర్‌ ఇప్పుడు వారి తలలు తీస్తారో? లేదా?

ఆయన మాట్లాడుతూ ‘ఉద్యోగాలకు రాజీనామా చేసినవారే మళ్ళీ తిరిగి ఉద్యోగాల్లో చేరుతున్న ఈ రోజుల్లో, తెలంగాణ ఉద్యమం లో పోరాడుతూ తన ఉద్యోగాన్ని కోల్పోయిన నళిని మళ్ళీ ఎందుకు ఉద్యోగం లో చేరకూడదు?. ఆమె ఇంతకు ముందు ఏ స్థానం లో కూర్చొని సేవలు అందించిందో, అదే స్థానం లో ఆమెని కూర్చోబెట్టండి. ఒకవేళ పోలీస్ శాఖలో ఆమెని తీసుకోవడానికి ఏదైనా రూల్స్ అడ్డువస్తే వేరే విభాగం లో అయినా ఆమెని తీసుకోండి’ అంటూ రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసాడు.

అలాగే తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో నియామకాలు చేపట్టాలని ఆయన అధికారులకు చెప్పుకొచ్చాడు. ఈ నియామకాలు అత్యంత పారదర్శకంగా, ఎక్కడా కూడా అవకతవకలకు తావు ఇవ్వకుండా, చాలా పకడ్బందీగా చెయ్యాలని ఆదేశాలు జారీ చేసాడు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన పోలీస్ నియామకాలపై నివేదిక ఇవ్వాలంటూ అధికారులను అడిగాడు.

పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ లాగే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు ఉంటుందని, ఉత్తర, దక్షిణ తెలంగాణ లో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఇది ఇలా ఉండగా సచివాలయం లో ఉండే అధికారులు ప్రజా సమస్యల పై సత్వర పరిష్కారానికి మార్గం చూపాలని, ప్రతీ సమస్య పరిష్కారానికి ఒక నిర్దిష్టమైన సమయం ని ఏర్పాటు చేసి, ఆ సమయంలోపు సమస్య పరిష్కారం అవుతుందా లేదా అనేది సమీక్షించాలని ఆయన అధికారులను కోరాడు.