‘టి న్యూస్‌’ ఛానల్‌ షిఫ్టింగ్‌కు సిద్ధమౌతుందా…

0
404

ఏదిఏమైనా అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లుతుంది. ఆ పవర్‌ పోయిందంటే పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోతుంది.

అప్పటి వరకూ మన అడుగులకు మడుగులొత్తిన అధికారులు రూల్స్‌ గట్రా అంటూ మనకే ఎదురు తిరుగుతారు. ఈ అవమానాన్ని తట్టుకోవాలంటే కొద్దిగా కష్టమే. కానీ తప్పదు.

ఇప్పుడు అలాంటి పరిస్థితి బీఆర్‌ఎస్‌కు వచ్చిపడిరది. 2011లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి బంజారీహిల్స్‌లోని పూరి జగన్నాథుని ఆలయాన్ని ఆనుకుని అప్పటి టీఆర్‌ఎస్‌ పార్టీ..

నేటి బీఆర్‌ఎస్‌ పార్టీ కొంత భూమిని తీసుకుని పార్టీ ఆఫీసును కట్టుకున్నారు. అదే భవనంలో కేసీఆర్‌ కుటుంబానికి చెందిన ‘టి`న్యూస్‌’ ఛానల్‌ను కూడా నిర్వహిస్తున్నారు.

ఈ ఛానల్‌ నిర్వహణ అనేది పక్కా వ్యాపారం. ఒక రాజకీయ పార్టీకి కేటాయించిన స్థలంలో ఎలాంటి వ్యాపార లావాలేదేవీలకు ఇవ్వకూడదు. కానీ ఇన్నాళ్లూ గులాబీ పార్టీ అధికారంలో ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు.

Chiranjeevi was shocked by Krantikumars insults
కానీ కాలం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండదు కదా.. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ వెంటనే రెవెన్యూ అధికారులకు కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసులో టి న్యూస్‌ ఛానల్‌ నడుస్తున్న విషయం గుర్తుకు వచ్చింది.

వెంటనే బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ ఇన్‌చార్జ్‌ శ్రీనివాసరెడ్డికి నోటీసులు అందజేశారు. అర్జంటుగా ఇక్కడి నుంచి ఛానల్‌ను తరలించాలని..

ఎప్పటిలోగా తరలించేది వారంలోగా తమకు అధికారికంగా చెప్పాలంటూ అందులో పేర్కొన్నారు. అధికారులు ఇలా ఒక్కసారిగా రూల్స్‌ అంటూ రావటంతో ఏం చేయాలో పాలు పోవడం లేదు.

నిజానికి రెండు, మూడు నెలల కిందటే ఈ ఛానల్‌ను నందినగర్‌ మెయిన్‌రోడ్డులో ఉన్న ఓ స్థలంలోకి మార్చాలని అనుకున్నారు. అక్కడ ఓ బిల్డింగ్‌ నిర్మించాలని ప్రణాళికలు కూడా వేశారు.

ఎందుకనో అది వర్కవుట్‌ కాలేదు. ఇప్పుడు ఇక తరలించక తప్పని పరిస్థితి. ఓవైపు పార్టీ ఓటమితో యాడ్స్‌ రెవెన్యూ దారుణంగా పడిపోయింది.

పార్టీకి సంబంధించిన నాయకులు యాడ్స్‌ ఇవ్వడం మానుకున్నారట. అదేమని అడిగితే వ్యాపారాల విషయంలో ఆచితూచి ఉండాలి. లేకపోతే ఆర్ధికంగా నష్టం తప్పదు.

అప్పుడు అసలు రాజకీయ జీవితానికే ఎసరు వస్తుంది అని ఓ రియల్టర్‌ కమ్‌ ఎమ్మెల్యే జనవరి 1 సందర్భంగా యాడ్స్‌ కోసం వెళ్లిన నమస్తే తెలంగాణ ప్రతినిధితో చెప్పారట..

ఏం చేస్తాం ఎవరి బాధలు వారివి. ఏది ఏమైనా ఈసారి టీ న్యూస్‌ ఛానల్‌ను అక్కడి నుంచి తరలించక తప్పదనేది వాస్తవం.