ఇది బాబుకు భారీ ఊరటే..

0
183
This is a huge relief for Babu tdp leader

మొత్తానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏదైనా జరగాలని కోరుకుందో.. అది జరగలేదు. తెలుగుదేశం పార్టీ ఏదైతే జరగాలని కోరుకుందో అదే జరిగింది. అదే చంద్రబాబుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం.

ఒకటి, రెండు కాదు.. ఏకంగా మూడు కేసుల్లో హైకోర్టు బుధవారం చంద్రబాబు నాయుడుకు బెయిల్‌ను మంజూరు చేసింది. వీటిలో ఒకటి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసు, రెండోది ఇసుకకు సంబంధించిన కేసు, మూడోది మద్యం కేసు.

రాష్ట్ర రాజకీయాల్లో కేవలం తానొక్కడినే ఏకఛత్రాధిపత్యం చెలాయించాలని, విపక్ష పార్టీలను సోదిలోకూడా లేకుండా చేయాలని కలలుగన్న ముఖ్యమంత్రి వై.యస్‌.

జగన్‌మోహన్‌రెడ్డికి చంద్రబాబుకు ఇలా మూడు కేసుల్లో బెయిల్‌ మంజూరు కావడం.. అందులోనూ ఎన్నికలకు అతి సమీపానికి వచ్చిన ఈ తరుణంలో రావడం ఆశనిపాతమే అనుకోవచ్చు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును 50 రోజులకు పైగా రాజమండ్రి కేంద్ర కర్మాగారంలో ఉంచిన జగన్‌ ప్రభుత్వం ఆ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ రావడాన్ని జీర్ణించుకోలేదనేది బహిరంగ రహస్యం.

అందుకే చంద్రబాబును ఎలాగైనా జైలుకే పరిమితం చేయాలనే తలంపుతో అసలు వేయనే వేయని విజయవాడ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అక్రమాలకు పాల్పడ్డారని ఓ కేసు పెట్టారు.

One MP in YCP and one MP out of YCP

ఒకవేళ ఇందులోంచి బయటపడినా.. మళ్లీ లోపలకు పంపటానికి మద్యం కేసును బనాయించారు. దీనిలోంచి కూడా బయటపడితే ఎలా అని ఆలోచించి ఇసుకను తక్కువ ధరకు అమ్మకాలు జరిపి ఖజానాకు నష్టం చేకూర్చారనే నెపంతో మరోకేసును కూడా పెట్టారు.

ఇలా వరుస కేసులతో చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేయాలని ప్లాన్‌ వేశారు తాడేపల్లి పెద్దలు. బుధవారం చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట కలగడంతో ఆయన ముఖంలో మరింత ఉత్సాహం కనిపించింది.

ఆ ఉత్సాహంతో తునిలో జరిగిన రా.. కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు మరింత దూకుడుగా తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఇప్పటికే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటీషన్‌ సుప్రీంలో పెండిరగ్‌లో ఉంది. ఈ కేసుకు సంబంధించి వాదనలు కూడా పూర్తయ్యాయి.

తీర్పును రిజర్వ్‌ చేశారు. ఒకవేళ సుప్రీంలో ఆ క్వాష్‌ పిటీషన్‌లో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే.. ఈ కేసులన్నీ వీగిపోవడం ఖాయం. అప్పుడు చంద్రబాబు దూకుడు రేంజ్‌ కూడా మారిపోతుంది. ఇప్పుడు వైసీపీకి ఇదే భయం పట్టుకుంది.