వైసీపీలోకి ఒక ఎంపీ ఇన్‌.. వైసీపీ నుంచి ఒక ఎంపీ అవుట్‌…

0
324
One MP in YCP and one MP out of YCP

చిరంజీవి హీరోగా నటించిన ‘ముఠామేస్త్రి’ చిత్రంలో విలన్‌ శరత్‌ సక్సేనా ఒక హత్య చేస్తాడు. ఆ తర్వాత ఒక చీమ చావుబతుకుల్లో పడితే.. దాన్ని జాగ్రత్తగా తీసి పక్కన పెడతాడు.

అది కాస్తా ఊపిరి పీల్చుకుని వెళ్లిపోతుంది. దీనిపై శరత్‌ సక్సేనా స్పందింస్తూ ‘‘ఒక జీవి ప్రాణం తీశాను.. ఒక జీవికి ప్రాణం పోశాను లెవిలైపోయింది’’ అంటాడు.

అలా ఉంది వైసీపీకి బుధవారం పరిణామాలు. ఓవైపు అనేక తర్జనభర్జనల అనంతరం విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నానిని పార్టీలోకి ఆహ్వానించి వైసీపీ కండువా కప్పారు.

నానీ వైసీపీ తీర్ధం పుచ్చుకోవటంపై అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయనుకోండి. నానికి విజయవాడ ఎంపీ సీటు,

ఆయన కోరిక మేరకు మరో రెండు ఎమ్మెల్యే సీట్లు కేటాయింపు డీల్‌తో నాని కాస్తా జగన్‌ పంచన చేరిపోయారు. ఈ విషయాన్ని వైసీపీ సోషల్‌ మీడియా పెద్ద ఎత్తున పాజిటివ్‌గా ప్రచారం చేయడం మొదలు పెట్టింది.

చూశారా మా జగనన్న పాలన చూసి టీడీపీ సిట్టింగ్‌ నేతలు కూడా వైసీపీ పంచన చేరుతున్నారని పోస్ట్‌లు పెట్టడం మొదలు పెట్టారు.

Keshine started getting shocks
ఇంతలో వారికి షాక్‌ తగిలేలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కర్నూలు సిట్టింగ్‌ ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు విజయవాడలోనే ప్రకటించారు.

దీంతో తాడేపల్లి వర్గాలు ఖంగు తిన్నాయి. ఒక ఎంపీ రావడంతో వచ్చిన ఆనందం నిలవకుండానే తమ ఎంపీ పార్టీకి రాజీనామా చేయడం వారు జీర్ణించుకోలని విధంగా మారింది.

ఈ సందర్భంగా డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ విజయవాడలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ…

నా నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవాచేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. కర్నూలు జిల్లాలో వలసలు ఆగాలన్నదే నా లక్ష్యం.

నా ఎంపీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను. రెండు రోజుల్లో ఢల్లీికి వెళ్లి స్పీకర్‌ గారికి నా రాజీనామాను సమర్పిస్తాను. ఇంకా ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయించుకోలేదు.

కానీ రాబోయే 20 సంవత్సరాలు ప్రజా జీవితంలోనే ఉంటాను. సన్నిహితులతో చర్చించిన తర్వాత నా రాజకీయా భవిష్యత్తును ప్రకటిస్తాను’’ అన్నారు.

అయితే రాబోయే ఎన్నికల్లో మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను కర్నూలు పార్లమెంట్‌ నుంచి పోటీ చేయాల్సిందిగా అధిష్ఠానం ఆదేశించడంతో,

ఆల్రెడీ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న సంజీవ్‌ కుమార్‌ను ఇన్‌డైరెక్ట్‌గా పొమ్మన్నట్టే అయింది. దీంతో ఎలాగూ తనకు సీటు రాదు కాబట్టి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తోస్తోంది.