ఇదీ కాంగ్రెస్‌ దళితులకు ఇచ్చిన గొప్ప గౌరవం

0
339
bhatti vikramarka mallu

నిమ్న వర్గాలకు అధికారం అనే విషయంలో దేశంలో అనేక చర్చోపచర్చలు జరుగుతూ ఉంటాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ సుధీర్ఘకాలం దేశాన్ని పాలించింది. ఈ క్రమంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో అనేక వర్గాలు, జాతులకు చెందిన వ్యక్తులకు వీలైనంత వరకూ సముచిత స్థానం కల్పిస్తూ వచ్చింది.

కాలానుగునంగా వచ్చిన మార్పుల్లో భాగంగా కాంగ్రెస్‌ నుంచి వేరుపడి అనేక ప్రాంతీయ పార్టీలు పురుడు పోసుకున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను తీసుకుంటే దాదాపు 90 శాతానికి పైగా పార్టీలు కాంగ్రెస్‌ మూలాల్లోంచి, దాని సిద్ధాంతాల్లోంచి పుట్టినవే. అయితే ప్రాంతీయ పార్టీగా అవతరించిన తర్వాత తమ అస్తిత్వాన్ని చాటుకోవటానికి అవి స్వంత సిద్ధాంతాలను, నినాదాలను ఎంచుకున్నాయి.

bhatti vikramarka mallu

పొదుపు సీఎం గా రేవంత్ రెడ్డి

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పోకడలకు భిన్నంగా వెళ్లాలనే ఆలోచనతో అవి అడుగులు వేస్తుంటాయి. అయితే ముఖ్యంగా ఆయా పార్టీలకు చెందిన ముఖ్యమైన నాయకత్వ పదవి మాత్రం పార్టీని స్థాపించిన కులానికి చెందిన వ్యక్తి, అతని కుటుంబం చేతిలోనే ఉంటుంది. పైకి నిమ్న వర్గాలకు పెద్ద పీఠ వేస్తాం అని చెప్పినా.. ఆ పెద్ద పదవి మాత్రం ఇవ్వరు. కనీసం రెండో స్థానం కూడా ఇవ్వటానికి వారికి మనసు ఒప్పుకోదు.

కానీ జాతీయ పార్టీల్లో ఇలా కాదు. కేవలం ఇక్కడ మాత్రమే అన్ని కులాలు, వర్గాల వారికి ఏదో ఒకరోజు ఖచ్చితంగా గుర్తింపు, గౌరవం దక్కుతాయి. తెలంగాణనే తీసుకుంటే 2014 ఎన్నికల్లో కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఒక దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తాం అంటూ వాగ్ధానం చేశారు. అంతే కాదు. కేసీఆర్‌ మాట అంటే మాటే.. లేకపోతే తల నరుక్కుంటా అన్నారు.

ఆ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి దళితునికి సీం పదవి అనే నినాదాన్ని పక్కనపెట్టి కేసీఆర్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. పేరుకు ఉప ముఖ్యమంత్రి పదవి దళితులకు ఇచ్చినప్పటికీ వారికి పవర్స్‌ లేకుండా చేసి అవమానించారు. అలాగే 2018 ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. అప్పుడు కూడా కేసీఆరే ముఖ్యమంత్రి అయ్యారు కానీ.. దళితుణ్ణి మాత్రం సీఎం కాకుండా డిప్యూటీ సీఎంకు పరిమితం చేశారు.

అంతేకాక ముందస్తు అనుమతి లేకుండా వారికి కనీసం ప్రగతిభవన్‌లోకి అడుగుపెట్టే అవకాశం కూడా ఇవ్వలేదు. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కేసీఆర్‌ తన దొరల మనస్తత్వాన్ని చాటుకుంటూ నిర్మించుకున్న ‘ప్రగతి భవన్‌’ కంచుకోట కంచెలను పెకిలించి పడేసింది.

అంతే కాకుండా అత్యంత విలాసవంతంగా కేసీఆర్‌ ప్రజాధనం కోట్ల రూపాయలు కుమ్మరించి కట్టించిన సీఎం నివాసాన్ని దళితనేత, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికార నివాసంగా కేటాయించి దళితులకు కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ సముచిత గౌరవం ఇస్తుందని మరోసారి చాటుకుంది. దీని ద్వారా కాంగ్రెస్‌ పార్టీ పాలనలో అన్ని వర్గాలకు, కులాలకు గౌరవం ఎలా దక్కుతుందో చెప్పకనే చెప్పినట్లు అయింది.