కె.ఏ. పాల్‌ రాష్ట్రపతి అభ్యర్ధిని కాదు

0
500

రాజకీయాల్లో నిఖార్సయిన నాయకులు ఎంత ముఖ్యమో.. అప్పుడప్పుడూ ప్రజలకు కామెడీని పంచే నాయకులు కూడా అంతే ముఖ్యం. మిగిలిన రాష్ట్రాల్లో ఏమో కానీ.. మన తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఆ లోటు కె.ఏ.పాల్‌ రూపంలో వందకు వంద శాతం తీరుతోందని చెప్పాలి. 2009 ఎన్నికలకు ముందు విదేశాల్లో మత బోధనలు చేసుకుంటూ ఉన్న కేఏ పాల్‌ ప్రస్తుతం భారతదేశాన్ని, తెలుగు రాష్ట్రాలను ఉద్దరించే పనిలో ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నారు అని చెప్పవచ్చు.

దాన్ని మించిన కామెడీ

మొన్నామధ్య మా ప్రజాశాంతి పార్టీ ద్వారా రాబోయే ఎన్నికల్లో 42 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని నేను ప్రధాని కాబోతున్నాను. పవన్‌ కల్యాణ్‌ జనసేనను నమ్ముకుంటే ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు. అదే నా పార్టీలో చేరితే, నేను ఎలాగూ ప్రధానిగా కేంద్రానికి వెళతాను కాబట్టి అతన్ని ముఖ్యమంత్రిని చేస్తాను అంటూ చేసిన కామెడీకి ఇప్పటికీ నవ్వు ఆపుకోలేక చస్తున్నారు తెలుగు ప్రజలు. తాజాగా ఢల్లీిలో దాన్ని మించిన కామెడీ చేశాడు పాల్‌. ఢల్లీిలో విలేఖరులతో మాట్లాడుతూ.. అందరూ అనుకుంటున్నారట నేను రాష్ట్రపతి అభ్యర్ధిని అని.

నేను చెపుతున్నా రాసుకోండి

కానీ మీడియా ముఖంగా చెపుతున్నా.. నేను రాష్ట్రపతి అభ్యర్ధిని కాదు. మా పార్టీకి సంబంధించిన ‘సేవ్‌ సెక్యులర్‌ ఇండియా’ కూటమిలో 18 పార్టీలు ఉన్నాయి. అయినా నేను చెపుతున్నా రాసుకోండి.. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేది ఎన్‌.డి.ఏ అభ్యర్ధి మాత్రమే. 60శాతం ఓట్లతో గెలుస్తారు. విపక్షాల్లో మూడు, నాలుగు కూటములు ఉన్నాయి. దీని వల్ల ఉపయోగం లేదు. అందరూ ఒక తాటిమీదకు రావాలి. మరోసారి చెపుతున్నా అందరూ అనుకుంటున్నట్లు నేను రాష్ట్రపతి అభ్యర్ధిని కాదు అంటూ జాతీయ మీడియాకు మంచి కామెడీ పంచారు పాల్‌.

ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఓటే లేకుండా

2009లో పోటీ చేయటానికి ఉవ్విళ్లూరిన పాల్‌కు వై.యస్‌. రాజశేఖరరెడ్డి గట్టి ఝలక్ ఇచ్చారు. పాల్‌కు ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఓటే లేకుండా చేశారు. దీని వెనకాల రాజశేఖరరెడ్డి ప్రమేయం ఉందని పాల్‌ ఇప్పటికీ నమ్ముతుంటారు. తాను పోటీ చేస్తే గెలిచి, ముఖ్యమంత్రిగా కూడా అయ్యే అవకాశం ఉండటంతో తనకు ఓటు హక్కు లేకుండా వైయస్సార్‌ చేశారని ఆయన ఓ సందర్భంలో అన్నారు.