ఉక్రెయిన్ నుండి హైదరాబాద్, వైజాగ్ చేరుకున్న విద్యార్థులు

0
1542

ఉక్రెయిన్ నుండి భారతీయుల తరలింపు కొనసాగుతుంది. ప్రత్యేక విమానంలో అక్కడ చిక్కుకున్న వారిని తరలిస్తున్నారు. తెలుగు విద్యార్థులు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఉక్రెయిన్ నుండి వచ్చిన వారికి వారి తల్లి తండ్రులు స్వాగతం పలికారు. వారి పిల్లలను చూసి వారు ఆనందంతో కన్నీరు పెడుతున్నారు. గత వారం నుండి వారు కంటి మీద కునుకు లేకుండా, తిండి లేకుండా జీవించారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన వారిని చూసి పిల్లల తల్లి తండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆ స్టేషన్ చుట్టూ బ్లాస్ట్ లు

మర్చి ఒకటో తేదీ నుండి తాము అనేక కష్టాలు పడ్డామని వారు చెబుతున్నారు. ఎలాగోలా రైల్వేస్ స్టేషన్ కి చేరుకున్నా.. ఆ స్టేషన్ చుట్టూ బ్లాస్ట్ లు జరగడంతో భయభ్రాంతులకు గురయ్యామని చెబుతున్నారు. అక్కడి నుండి వేరే చోటికి క్యాబ్ లో వెళ్లినా.. వెళ్లినంత సేపు భయంతోనే వెళ్లినట్లు చెప్పారు. ఇంకా కొంత మంది అక్కడే ఉంది పోయారని వారు చెబుతున్నారు. వాళ్లకు ఏ హాని జరుగకుండా రావాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు.