తీవ్ర విషాదం.. ప్రియుడి కోసం రష్మీ ఆత్మహత్య

    0
    2829

    ఈ ప్రేమ ఇంతే. అది కూడా వయసులో ఉన్నప్పుడు మరింత బలంగా ఉంటుంది. ఒకరినొకరు విడిచి ఉండలేమనే భావన కలుగుతుంది. కొన్ని ప్రేమలు సఫలం అయినా.. మరి కొన్ని ప్రేమలు విఫలం అవుతున్నాయి. మరి కొన్ని ప్రేమలు ఎవరికీ తెలియకుండా మనసులోనే ఉండి పోతున్నాయి. అదే.. వన్ సైడ్ లవ్ అన్నమాట. ఇక తాజాగా ఓ ప్రేమ జంట తమ ప్రేమలో సఫలం అయినా.. జీవితంలో ఓడి పోయారు.

    బెంగళూరు లో ప్రేమ జంట విషాదం

    బెంగళూరు లో ఓ ప్రేమ జంట రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థాయికి వెళ్లిపోయారు. ఇద్దరూ కలసి చెట్టపట్టాలు వేసుకొని తిరిగారు. అయితే వారికి ఒక అనుమానం వచ్చింది. వారి ప్రేమకు పెద్దలు అడ్డు చెబుతారేమో అని అనుమానం వచ్చింది. దీనితో ప్రియురాలు తీవ్ర ఆందోళనతో ఆత్మహత్య చేసుకుంది. ఆ తరువాత ప్రియురాలు ఆత్మహత్య తో కుంగిపోయిన ప్రియుడు తీవ్ర మనోవేదనకు గురి అయ్యాడు. ఆ వెంటనే అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

    ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోరేమోనని

    ఆ వివరాలలోకి వెళితే.. బెంగళూరు లో చొట్టనహళ్లికి చెందిన 17 ఏళ్ల రష్మీ, ఆలదహళ్లి గ్రామానికి చెందిన
    18 ఏళ్ల శశాంక్‌ గౌడ ప్రేమించుకున్నారు. రెండేళ్లుగా ప్రేమించుకోవడంతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థాయికి వెళ్లిపోయారు. తమ ప్రేమను ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోరేమోనని ఆందోళనతో తొలుత రష్మీ ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

    రెండు గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు

    ఈ విషయం తెలిసిన శశాంక్‌ గౌడ తీవ్ర మనోవేదనకు గురి అయ్యాడు. రష్మీ లేని ఈ లోకంలో తాను జీవించలేనని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో వారి తల్లి తండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ రెండు గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంత చిన్న వయసులో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచి వేస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.