నమ్మకం గురించి నువ్వు మాట్లాడితే ఎలా కలెక్షన్‌ కింగూ

0
618

మంచు భక్తవత్సల నాయుడు… అలియాస్‌ కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు ఏం మాట్లాడినా ముక్కు సూటిగానే ఉంటుంది. మనసులో ఏం దాచుకోరు. అందుకే రాజకీయాల్లో ఎక్కువ కా లం కొనసాగలేకపోయారు. పార్టీని స్థాపించే విషయం ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లు రజనీ ప్రకటించిన విషయం తెలిసిందే. రజనీకి ప్రాణ స్నేహితుడు అయిన మోహన్‌బాబు ఈ సందర్భంగా ‘‘రాజకీయం అంటేనే రొచ్చు.. బురద. ఆ బురద నువ్వు అంటించుకోకుండా ఈ రొచ్చులోకి నువ్వు రాకపోవడమే మంచిది. డబ్బులిచ్చి ఓట్లుకొనలేము, కొనము కూడా. ఇక్కడ ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలియడంలేదు’’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆయన ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవు అనే నానుడిని నిజమైనదే. మోహన్‌బాబు వంటి ముక్కుసూటి మనుషులు ఈ రంగంలో నిదొక్కుకోలేక పోవడం వింతేమీ కాదు. గతంలో మోహన్‌బాబు తె లుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. రాజకీయ రంగం రొచ్చు అన్న పదం వాడటం పట్ల చాలా మంది భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. ఈ రంగం రొచ్చు కాదని కొన్ని నైతిక విలువలు లేని పందులు ఇటు రావడం వలన రాజకీయంపై ప్రజలకు చులకన భావం ఏర్పడిరదన్నది వాస్తవం.

ఈ భావాన్ని పోగొట్టాంటే సాధ్యమయ్యేపని కాదు అని అందరికీ తెలిసిందే. కొందరు అవకాశవాదులు, స్వార్ధపరులు చేసిన, చేస్తున్న పనుల వల్ల దిగజారిపోతోందని ఏకంగా మొత్తం రాజకీయాలనే రొచ్చు, బురద అని వ్యాఖ్యానిస్తే ఎలా?. గతంలో నిన్ను నమ్మే కదా యన్టీఆర్‌ రాజ్యసభ సీటు ఇచ్చింది. కానీ నువ్వు చేసింది ఏమిటి? వెన్నుపోటు ఎపిసోడ్‌లో అన్నగారిని వంచించి చంద్రబాబు పంచన చేరిపోయావు. ఆ తర్వాత చంద్రబాబు చేతిలో మోసపోయి మర యన్టీఆర్‌ పంచన చేరావు. ఇలాంటి నువ్వు ఎవరి నమ్మాలో తెలియడం లేదంటే ఎలా కలెక్షన్‌ కింగూ అంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు.