అభిజిత్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఎవరిచ్చారు

0
474

అతను టాలీవుడ్‌లో కొద్దిగా గుర్తింపు ఉన్న హీరో. బిగ్‌బాస్‌ సీజన్‌ 4 పుణ్యాన ఊహించనంతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విన్నర్‌ కావడంతో ఇక చెప్పేదేముంది సూపర్‌ ఫాలోయింగ్‌ వచ్చేసింది. ఎవరి గురించి మాట్లాడుతున్నామో అర్ధం అయింది కదా. అభిజిత్‌… శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమాతో అభిజిత్‌ హీరోగా ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో అతనికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడిరది. అయితే అభిజిత్‌ ఇండియన్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మకు అభిమాని. ఆయన ఆటంటే విపరీతమైన ఇష్టం. తాను అభిమానించే రోహిత్‌ నుంచి ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ రావడంతో అభిజిత్‌ ఆనందంలో మునిగిపోయాడు.

పండుగ రోజున కొరియర్‌ బాయ్‌ బెల్‌ కొట్టడంతో అభిజిత్‌ తలుపు తీసాడట. కొరియర్‌ బాయ్‌ ఓ పార్సిల్‌ను చేతిలో పెట్టి సంతకంతో పాటు ఓ సెల్ఫీ కూడా తీసుకుని వెళ్లిపోయాడట. పార్సిల్‌లో ఏముందా అని ఆసక్తిగా దాన్ని ఓపెన్‌ చేసిన అభిజిత్‌ నిజంగానే సర్‌ప్రైజ్‌ అయ్యాడట. ఆ పార్సిల్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ నుంచి వచ్చింది. అందులో రోహిత్‌ శర్మ ఓ జెర్సీని పెట్టి దానిపై తన ఆటోగ్రాఫ్‌ను కూడా చేసి పంపాడట. తన అభిమాన క్రికెటర్‌ నుంచి వచ్చిన ఈ సర్‌ప్రైజ్‌ను చూసి అభిజిత్‌ తెగ ఆనంద పడిపోయాడట.

ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అందరితో పంచుకున్నారు. రోహిత్‌ శర్మ తల్లి తెలుగు వారే. ఈ ఆకారణంగా రోజూ తెలుగు రాష్ట్రాల్లో జరిగే విషయాలు రోజూ ఇంట్లో చర్చకు వస్తుంటాయట. బిగ్‌బాస్‌ సీజన్‌ 4 గురించి కూడా చర్చకు రావడంతో విన్నర్‌ అభిజిత్‌ తన అభిమాని అని తెలుసుకున్న రోహిత్‌ అతనికి ఫోన్‌ ద్వారా కూడా శుభాకాంక్షలు తెలిపాడట. దీంతో అభిజిత్‌ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.