ఈ చిట్కాలు పాటిస్తే రక్తపోటు(బీపీ)కి చెక్ పెట్టచ్చు

0
1396

రక్తపోటు, దీనినే సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఒంట్లో ఉంటూ ఎటువంటి సింప్టమ్స్ చూపకుండా చివరి క్షణంలో స్ర్టోక్ కు గురి చేసి జీవితాలతో ఆడుకుంటుంది. అందుకే ప్రతి మూడు నెలలకు ఒకసారైనా (వీలును బట్టి నెలకోసారైనా) రక్తపోటును చెక్ చేసుకుంటూ ఉండాలి.

జీవిన విధానం మార్పుతోనే

ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లలో చోటు చేసుకుంటున్న విపరీత మార్పులు వెరిసి రక్తపోటుకు దారి తీస్తున్నాయి. దాదాపు కొన్నేళ్ల క్రితం వృద్ధులకు మాత్రమే రక్తపోటు వచ్చేది. ఇప్పుడు యువకులను కూడా రక్తపోటు వేధిస్తుంది. దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. వైద్యుల సూచనలు పాటించకుంటే హార్ట్ ఎటాక్ తో ప్రాణం మీదకు రావచ్చు లేదా.. బ్రెయిన్ స్ర్టోక్ తో అవయవాలు కూడా పడిపోవచ్చు. అందుకే రక్తపోటు (బీపీ)ని ఎప్పుడూ నియంత్రణలో ఉంచాలి. అయితే రక్తపోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పోషకాహారం.. వ్యాయామం తప్పనిసరి

ఉరుకులు, పరుగుల జీవితంలో ఎప్పుడు ఏం చేస్తున్నామో తెలియకుండా ఉంటుంది ఇప్పుటి జనరేషన్‌కు. పెద్దలు చెప్పినట్లు ఏ టైంలో ఏది చేయాలో అదే చేయాలని ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళ్తే రోగాల భారిన పడాల్సిందే. ఎంత సంపాదించినా జానెడు పొట్ట కోసమే అనే నానుడిని మరువకూడదు. సరైన సమయంలో పొట్టలో ఏదో ఒకటి పడేయాలని అనుకునే నేటి జనరేషన్ కు రోగాలు కూడా పెద్దగా బాధిస్తుంటాయి. ఈ కోవలో ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఉంటారు. వారి ఉరుకులు పరుగులతో పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ రైస్ లు ఎక్కువగా తింటూ రోగాలను కొనుక్కుంటారు.

ప్రతి అరగంటకు లేచి కనీసం రెండు నిమిషాలు

మంచి పోషకాహారం, అది కూడా ఇంటి భోజనం చేస్తే చాలా రోగాలు దరికి రావాలన్నా భయపడతాయని మరిచిపోతారు. దీనికి తోడు ఎప్పుడూ కుర్చీకి అతుక్కొని ఉండే ఉద్యోగాలు.. ఇవి మరింత ముప్పును తెచ్చిపెడుతున్నాయి. ఎంత కుర్చీకి అతుక్కొని చేసే ఉద్యోగమైనా ప్రతి అరగంటకు లేచి కనీసం రెండు నిమిషాలు అలా క్యాజువల్ వాక్ చేస్తుండాలి. ప్రతి రోజూ ఉదయం వీలుకాకుంటే సాయంత్రమైనా గంట టైం వాకింగ్ కు కేటాయిస్తే మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మద్యం, డ్రగ్స్ ను పూర్తిగా అవేట్ చేయడమే మేలు

సినిమాల్లో ప్రేక్షకుల చప్పట్ల కోసం రాసే డైలాగులను వళ్లిస్తూ అప్పుడప్పుడూ మద్యం తాగచ్చని దానికి డాక్టర్లే చెప్పారంటూ వారికి అంటగడుతూ లేని పోని మాటలు చెప్పి మద్యం వైపు మళ్లుతుంటారు. కానీ ఎప్పుడూ తాగకపోవడమే మంచిది. అప్పుడప్పుడూ అనేది వేగంగా అదీ చెడ్డ అలవాటు అయితే మరింత వేగంగా బానిసను చేస్తుంది. ఇక పబ్ కల్చర్ కు అలవాటు పడిన కొంత మంది డ్రగ్స్ తీసుకుంటారు. కొంచెం సేపు మత్తులో ఉన్నా అది బాడీపై అనేక ప్రభావాలను చూపుతుందని తెలిసి కూడా డ్రగ్స్ వాడుతుంటారు. ఇది మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

తృణ ధాన్యాలతో మేలు

ఆరోగ్య కరమైన తృణ ధాన్యాలు తీసుకుంటే శరీర పోషణకు, వ్యాధులను తరిమేసేందుకు చాలా ఉపయోగపడతాయి. వాటిని అలవాటుగా చేసుకోవాలని సూచిస్తున్నారు ప్రకృతి వైద్యులు. చిన్న తనంలో అమ్మమ్మ, నానమ్మ లు ఇంట్లో చేసే వంటకాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి అవి వేగంగా ఎదిగేందుకు దోహదం చేస్తాయి. పెరిగి పెద్దయ్యాక వాటిని పట్టించుకోం. కానీ అవి తీసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిదని చెప్తున్నారు.