ఇక షుగర్‌కు సూది గుచ్చక్కర్లేదు..

0
348

మధుమేహం(షుగర్‌) వ్యాధి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి. ఒక్కసారి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తే.. ఇక దాన్ని మన శరీరంలోంచి తరిమేయడం అంత తేలికైన పని కాదు.

ఈ వ్యాధిపట్ల అవగాహన ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకుని షుగర్‌ లెవల్‌ను జాగ్రత్తగా మెయింటైన్‌ చేస్తుంటారు. అవగాహన లేనివారు అనేక సైడ్‌ ఎఫెక్ట్స్‌తో బాధ పడుతూ ఉంటారు.

కనీసం నెలలో ఒకసారైనా సూదుల ద్వారా రక్తాన్ని సేకరించి రక్త పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఈ ప్రక్రియ రోగులను చిత్రహింసలకు గురి చేస్తుంటుంది. అందుకే చాలా మంది షుగర్‌టెస్ట్‌ అంటేనే భయపడిపోతుంటారు.

ఈ భయానికి చెక్‌ పెడుతూ సూది గుచ్చకుండానే షుగర్‌ టెస్ట్‌ చేసే ఆధునిక పద్ధతిని కనిపెట్టారు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పూసా చిరంజీవిరావు అనే డాక్టర్‌.

ఈయన కనిపెట్టిన నాన్‌ ఎంజైమాటిక్‌ ఎలక్ట్రో కెమికల్‌ స్వెట్‌ గ్లూకోస్‌ ఎనలిటిక్‌ డివైజ్‌ అనే పరికరం ద్వారా శరీరం నుంచి రక్తం సేకరించకుండానే షుగర్‌ లెవల్స్‌ను గుర్తించ వచ్చు.

కేవలం మన ఒంటిపై ఉండే చెమట ద్వారానే ఇది సాధ్యమౌతుంది. ఎన్నో పరీక్షల అనంతరం దీనికి కేంద్రం కూడా ఆమోద ముద్ర వేసింది.

Check cholesterol with these cooking oils

డాక్టర్‌ శ్రీనివాసరావుకు దీనిపై పేటెంట్‌ కూడా ఇవ్వడం విశేషం. ప్రస్తుతం డాక్టర్‌ శ్రీనివాసరావు కాన్పూరు ఐఐటీలో సీనియర్‌ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు.

ఈయన కనిపెట్టిన నూతన పరికరం ద్వారా అమలు చేసే విధానంలో రక్తం సేకరించే అవసరం లేకపోవడం వల్ల సిరంజిల వాడకం తగ్గడంతో పాటు రోగులకు నరకయాతన తప్పుతుంది.

ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రీనివాసరావు ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. చిన్న తనం నుంచి మా కుటుంబంలో కూడా ఈ షుగర్‌ వ్యాధి వల్ల బాధపడుతున్న వారిని చూస్తూనే ఉన్నాను.

ముఖ్యంగా రక్త నమూనాలు సేకరించడం. కొందరిలో యూరిన్‌ సేకరించడం వంటి ప్రక్రియల వల్ల వారు పడే బాధ కళ్లారా చూశాను.

షుగర్‌ వ్యాధి గ్రస్తులను ఈ బాధలకు దూరం చేయాలనే ఉద్దేశంతో చాలా కాలంగా ఈ నూతన విధానాన్ని కనిపెట్టటానికి ప్రయోగాలు చేస్తున్నాను.

ఇంతకాలానికి నా శ్రమ ఫలించింది. కేంద్రం ప్రభుత్వం కూడా దీనికి ఆమోద ముద్ర వేయడం, పేటెంట్‌ కూడా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.

త్వరలోనే ఈ విధానం సామాన్య ప్రజలకు కూడా తక్కువ ధరలో అందుబాటులోకి రానుంది అన్నారు.