మంగళగిరి లో 50 వేల మెజారిటీ తో గెలిచి చూపిస్తా

0
364
nara lokesh mangalagiri

ఆంధ్ర ప్రదేశ్ లో మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు మొదలు కాబోతున్నాయి. టీడీపీ – జనసేన పార్టీలు ఒక కూటమి గా ఏర్పడి పోటీ చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కూటమి కి సంబంధించిన ఉమ్మడి మ్యానిఫెస్టో ని అలాగే అభ్యర్థుల ఎంపిక కి సంబంధించిన మొదటి లిస్ట్ ని వచ్చే నెల సంక్రాంతి సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉంది.

ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మరియు నారాలోకేష్ ఈసారి ఎక్కడి నుండి పోటీ చెయ్యబోతున్నారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలలో భీమవరం మరియు గాజువాక ప్రాంతాలలో పోటీ చేసి ఓడిపోయాడు. అలాగే నారా లోకేష్ మంగళగిరి ప్రాంతం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.

nara lokesh mangalagiri

వీళ్లిద్దరు ఓడిపోవడానికి ముఖ్య కారణం అతి తక్కువ సమయం లో పోటీ చెయ్యబోయే స్థానాలను నిర్ణయించుకోవడం వల్లే. అయితే లోకేష్ ఈసారి మంగళగిరి నుండి పోటీ చేస్తాడా అంటే అనుమానమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఎందుకంటే ఈసారి వైసీపీ పార్టీ తరుపున జగన్ గంజి చిరంజీవి ని ఎమ్యెల్యే అభ్యర్థిగా నిలబెట్టబోతున్నాడు. బీసీ సామజిక వర్గానికి చెందిన చిరంజీవి పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తుందని జగన్ నమ్మకం. చిరంజీవి దెబ్బకు నారా లోకేష్ మంగళగిరి నుండి పోటీ చెయ్యాలనే ఆలోచనని విరమించుకున్నట్టు వార్తలు వినిపించాయి.

అయితే ఇదే విషయాన్నీ నారాలోకేష్ ని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఒక రిపోర్టర్ అడగగా, ఆయన దానికి సమాధానం చెప్తూ ‘నేను వచ్చే ఎన్నికలలో మంగళగిరి నుండే పోటీ చేస్తాను. అందులో ఎలాంటి సందేహం లేదు. తెలుగు దేశం పార్టీ దశాబ్దాలుగా ఈ ప్రాంతం లో ఓడిపోతూనే ఉంది.

ఈ ప్రాంతాన్ని తెలుగు దేశం కి కంచుకోటగా మార్చి ఇస్తానని ప్రమాణం చేశాను. ఆ మాట మీద నేను కట్టుబడి ఉన్నాను. గతం లో నేను ఇక్కడ 5 వేల మెజార్టీ తో ఓడిపోయాను. కానీ ఈసారి 50 వేల మెజారిటీ తో ఈ ప్రాంతం నుండి గెలిచి చూపిస్తాను. ఈ ఐదేళ్ళలో నన్ను ఇక్కడి జనం చాలా బాగా అర్థం చేసుకున్నారు.

నాకు కూడా ఇక్కడి జనం బాగా కనెక్ట్ అయ్యారు, వీళ్ళతో సంబంధం నేను వదులుకోలేని, నా చివరి శ్వాస వరకు మంగళగిరి ప్రాంతం నుండే పోటీ చేస్తాను’ అంటూ నారా లోకేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.