‘గాలోడి’ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

0
450

‘గాలోడు’ మూవీ శుక్రవారం (నవంబర్ 18)న థియేటర్స్ లో రిలీజైంది. ఇందులో హీరోగా జబర్దస్త్ ఫేం సుడిగాలి సుధీర్ నటించారు. పులిచర్ల రాజశేఖర్ రెడ్డి ఈ మూవీకి డైరక్షన్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ పాజిటివ్ టాక్ తోనే ఆడుతోంది. విడుదలైన మొదటి రోజే రూ. 1.01కోట్ల గ్రాస్ ను కలెక్టర్ చేసింది. దాదాపు రూ. 2 కోట్ల మార్కును దాటినట్లు తెలుస్తోంది. ఈ టీవీలోని టాప్ షోలతో సుధీర్ బుల్లితెరకు దగ్గరయ్యాడు. ఆయన తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది.

పారితోషకాన్ని కూడా ఆ లెవల్లోనే వసూలు చేశారట

ఇక గాలోడు మూవీకి భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నారంట సుధీర్. దీనిపై చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ వేలో టాక్ ఉంది. ఆరు నెలలను టాప్ షోలను పక్కన పెట్టిన ఆయన మూవీ చేసినందుకు పారితోషకాన్ని కూడా ఆ లెవల్లోనే వసూలు చేశారట. రూ. 50 లక్షల వరకూ తీసుకున్నాట. సుధీర్ హీరోగా ఇది రెండో సినిమానే తన మొదటి సినిమా ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలోనే వచ్చింది. మరో ఛాన్స్ కూడా అతనికే ఇద్దామని అనుకున్నాడు సుధీర్ అందుకే వీరిద్దరి కాంబోలో వచ్చిందే ‘గాలోడు’.

మరిన్ని మంచి ప్రాజెక్టులు

సాఫ్ట్ వేర్ సుధీర్ కంటే గాలోడు మూవీకి రివ్యూలు బాగానే ఉన్నాయి. ఇందులో హీరో పాత్రకు మంచి స్కోప్ వచ్చింది. కానీ కథ విషయంలో మరింత బెటర్ గా ఉంటే బాగుంటుందని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇది గాడినపడ్డట్లేనని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. సుధీర్ రెమ్యునరేషన్ ను కూడా నెటిజన్లు స్వాగతం పలుకుతున్నారు. అప్ కమింగ్ హీరోలకు ఆ మేరకు ఉంటే మరిన్ని మంచి ప్రాజెక్టులు వస్తాయని కామెంట్లు గుప్పిస్తున్నారు.