ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాం చరణ్.. ఇక రెండు నెలల్లో బాజా భజంత్రీలే

0
1699

ప్రభాస్ పెళ్లి వార్త ఇప్పుడు ఇండస్ర్టీలో బాగా వైరల్ గా మారింది. చాలా మంది పెళ్లికి ఎదిగిన హీరోలను మీ పెళ్లెప్పుడూ..? అంటూ ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభాస్ పెళ్లి తర్వాతే అంటూ చెప్పి తప్పించుకుంటున్నారు. అంటే ప్రభాస్ పెళ్లి చేసుకోరనా..? మీరు కూడా పెళ్లి చేసుకోరా..? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాన్ని దాట వేస్తున్నారు సదరు హీరోలు. అయితే ఆయన పెళ్లి వార్తలపై ఇటీవల కొన్ని గాసిప్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.

కృష్ణంరాజు ఇటీవల మరణించడంతో ఆయన పెద్దమ్మ ప్రభాస్ పెళ్లిపై తీవ్రంగా ఒత్తిడి పెంచిందట. దీంతో ఆయన ఇంత మంది ఫ్యాన్స్ ఫ్యామిలీ ఉండగా నాకు పెళ్లి అవసరం లేదంటూ దాట వేస్తున్నాడని చెప్పాడట. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో దీనిపై కూడా ప్రభాస్ ప్రశ్నలను ఎదుర్కొంటూనే ఉన్నారు.

సల్మాన్ ఖాన్ తో పాటు ప్రభాస్..?

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ ఎదుర్కొంటున్న సెటైర్లను ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కూడా ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ప్రభాస్ పెళ్లిని సాకుగా చూపి ఇంకా కొంత మంది ముదురు బెండకాయలు కూడా ప్రభాస్ పై సెటైర్లు వేస్తున్నారు. ఇటీవల ‘లాఠీ’ సినిమా ప్రమోషన్ లో భాగంగా విశాల్ ను ఓ సినీ జర్నలిస్ట్ మీ పెళ్లి ఎప్పుడు అని అడిగిన ప్రశ్నకు ఆయన వింత సమాధానం చెప్పారు. ప్రభాస్ పెళ్లి తర్వాతే అంటూ నవ్వారు. దీంతో అవాక్కుకు గురయ్యాడు సదరు జర్నలిస్ట్.

ఆహా వీడియో గ్లింప్స్ తో సందడి

ఆహా ఓటీటీ ప్లాట్ ఫాం పై నందమూరి బాలకృష్ణ ప్రభంజనం సృష్టిస్తున్న షో ‘అన్ స్టాపబుల్ ఎన్‌బీకే’ సీజన్ 2లో స్టార్ల పరిచయంలో భాగంగా వచ్చే ఎపీసోడ్ లో ప్రభాస్, గోపీచంద్ షోలో బాలయ్య బాబుతో కలిసి సందడి చేయనున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో గ్లింబ్స్ ఈ రోజు (డిసెంబర్ 14)న విడుదలైంది. ఈ గ్లింబ్స్ లో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అంటూ బాలయ్య క్వశ్చన్ వేయడం మనకు కనిపిస్తుంది. అందులో సీక్రెట్ ఏమైనా ఉందా అంటూ బాలయ్య అడుగడం కనిపించింది.

ప్రభాస్ పెళ్లి వార్తను లీక్ చేసిన రామ్ చరణ్

ప్రభాస్ పెళ్లి వార్తను రాం చరణ్ లీక్ చేశాడు. బాలయ్య బాబు రామ్ చరణ్ మీ ఫ్రెండ్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించగా.. ‘ప్రభాస్ ఇంకో రెండు నెలల్లో పెళ్లి చేసుకోబోతున్నాడు’ అంటూ రామ్ చరణ్ చెప్పాడు. వచ్చే ఏడాదిలోనే అంటూ గోపీచంద్ కూడా అన్నాడు. అంటే ఇంకో 17 రోజుల్లో ఈ ఏడాది గడిచిపోతుంది. వచ్చే జనవరిని విడిచి పెట్టినా ఫిబ్రవరిలో మాత్రం ప్రభాస్ పెళ్లి జరుగే అవకాశం ఉందని సందడి చేసిన వీడియో గ్లింప్స్ ఇప్పుడు వైరల్ గా మారింది.

రేయ్ ఏం చెబుతున్నావ్ డార్లింగ్

రామ్ చరణ్ ప్రభాస్ పెళ్లి గురించి చెప్పడంతో ప్రభాస్ స్పందించారు. ‘రేయ్ ఏం చెబుతున్నావ్ డార్లింగ్’ అంటూ రామ్ చరణ్ ను ప్రభాస్ వారించాడు. అంటే రామ్ చరణ్ లీక్ చేశాడని ప్రభాస్ అన్నాడా..? ఇది నిజం కాదనే ఉద్దేశ్యంలో అన్నాడా..? అని ఇప్పుడు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నిజంగానే ప్రభాస్ పెళ్లి విషయం రామ్ చరణ్ కు తెలిసి లీక్ చేశాడా లేక.. రామ్ చరణ్ కు సెటైర్ వేశాడా.. ఈ విషయాలు తెలియాలంటే ఎపీసోడ్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.