పల్లవి ప్రశాంత్ బెయిల్ వాయిదా..రంగం లోకి లాయర్స్

0
357
pallavi prasanth

బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పోలీస్ రూల్స్ ని అతిక్రమించిన కేసు క్రింద అరెస్ట్ అయ్యి చెంచల్ గూడా సెంట్రల్ జైలుకు రెండు వారాల పాటు రిమాండ్ లోకి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ఈమేరకు ఈరోజు బెయిల్ పిటిషన్ పై కోర్టు లో పిటిషన్ వెయ్యగా, ప్రస్తుతానికి అది వాయిదా పడింది.

గ్రాండ్ ఫినాలే రోజు పోలీసులు వద్దని పదే పదే వారిస్తున్నా కూడా మాట వినకుండా అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ర్యాలీ ని నిర్వహించాడు పల్లవి ప్రశాంత్. అంతే కాకుండా అతని సొంత ఊరు నుండి జనాలు ఒక బస్సులో రాగ, వాళ్ళందరూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై దాడి చేసారు.

pallavi prasanth

బిగ్ బాస్ హౌస్ నుండి చంచల్ గూడ.. చరిత్రలో తొలిసారి

ముఖ్యంగా అమర్ దీప్ భార్య తేజస్విని మరియు తల్లి రూప వెళ్తున్న కారు గ్లాస్ అద్దాలను పగలగొట్టారు. వీరి వెనుక వస్తున్న బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్స్ పైన కూడా చాలా అసభ్యంగా వ్యవహరించారు.

వీటి అన్నిటికి పల్లవి ప్రశాంత్ ని బాద్యులు గా భావించి పోలీసులు నాన్ బైలబుల్ ఛార్జీషీట్స్ ని దాఖలు చేసారు. రోజు రోజుకు కేసు జటిలం అవ్వడం తో పల్లవి ప్రశాంత్ తరుపున హై కోర్టు న్యాయవాదులు వాదించే అవకాశం ఉందని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం.

సామాన్య రైతు బిడ్డగా పాపులర్ అయినా పల్లవి ప్రశాంత్ కోసం ఏకంగా హై కోర్టు లాయర్ వాదించడానికి రావడం ఏందీ? అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి.

బహుశా బిగ్ బాస్ హౌస్ లో తనకి మొదటి రోజు నుండి తోడు గా ఉంటూ తప్పటడుగులు వెయ్యకుండా కాపాడిన శివాజీ, తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి పల్లవి ప్రశాంత్ కోసం హై కోర్టు న్యాయవాదులను ఏర్పాటు చేసి ఉండొచ్చు అని నెటిజెన్స్ అనుకుంటున్నారు.

మరోపక్క ప్రశాంత్ అరెస్ట్ పై బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవ్వరూ కూడా స్పందించలేదు. కేవలం భోలే మాత్రమే ప్రశాంత్ కోసం వచ్చాడు. ఇన్ని రోజులు హౌస్ లో అతనితో కలిసి తిరిగిన శివాజీ మరియు యావర్ ఇప్పటి వరకు బహిరంగంగా ప్రశాంత్ విషయమై స్పందించలేదు. చూడాలి మరి ఈ కేసు ఎంత దూరం వెళ్తుందో, పల్లవి ప్రశాంత్ ఎప్పుడు బయటకి వస్తాడో అనేది.