జనసేన స్థానాలు క్లారిటీ వచ్చినట్టేనా

0
282
janasena tdp

టీడీపీ మరియు జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవడం తో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి మనమంతా చూస్తూనే ఉన్నాం. జనసేన పార్టీ అభిమానులకు మాత్రం టీడీపీ తో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం మొదట్లో ఇష్టం ఉండేది కాదు.

కానీ ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితిలో పొత్తు పెట్టుకొని పోటీ చెయ్యడమే మంచిది అని వాళ్లకు కూడా అర్థం అయ్యింది. ఎందుకంటే జనసేన పార్టీ ని ఈ 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ కేవలం కొన్ని స్థానాల మీదనే ఫోకస్ పెట్టాడు. కోస్తాంధ్ర తప్ప మిగిలిన చోట్ల జనసేన కి కనీసం ఇంచార్జిలను కూడా నియమించలేదు పవన్ కళ్యాణ్.

janasena tdp

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. వేణు గోపాల స్వామి సంచలనం

ఇలాంటి సమయం లో ఒంటరిగా పోటీ చేస్తే కేవలం 20 స్థానాలు గెలవొచ్చు ఏమో కానీ, అధికారం ని మాత్రం ఎంజాయ్ చెయ్యలేరు. అందుకే ప్రస్తుతం పొత్తు సంజీవని లాంటిది అని అర్థం చేసుకున్నారు. అయితే జనసేన పార్టీ ఎన్ని స్థానాల నుండి పోటీ చేయబోతుంది అనేది అభిమానులకు కూడా అర్థం కావడం లేదు.

సంక్రాంతి లోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన యువగళం ముగింపు సభ కి వెళ్లడం జనసేన పార్టీ అభిమానులకు ఇష్టం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్థాయి ప్రజాధరణ ఉన్న వ్యక్తి లోకేష్ ని ప్రశంసిస్తూ మాట్లాడడం వాళ్లకి ఇష్టం లేదు కాబట్టి.

అభిమానుల కోరిక మేరకే పవన్ కళ్యాణ్ యువగళం సభకి దూరం గా ఉండాలని అనుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించడం తో ఇక కాదు అనలేక రావాల్సి వచ్చింది. లోకేష్ ని పొగుడుతూ నాలుగు మాటలు మాట్లాడాల్సి వచ్చింది.

ఇది కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ని రామ్ మోహన్ నాయుడు గారు ఎక్కడో నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు అంటూ పవన్ కళ్యాణ్ ని పొగుడుతాడు. ఈ డైలాగ్ వాడాల్సిన అవసరం ఏమిటి? అంటే సీట్ల పంపకం లో పవన్ కళ్యాణ్ తగ్గుతున్నాడా?

చంద్రబాబు ఎన్ని స్థానాలు ఇస్తే అన్ని స్థానాలు తీసుకొని సైలెంట్ గా ఉండమని అనుకుంటున్నాడా? వంటి సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో సంక్రాంతి లోపు తెలియనుంది.