జగన్‌లాంటి దుర్మార్గుడికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు..

0
251
A wicked man like Jagan has no right to be in politics

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా తిరువూరులో రా.. కదలిరా బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. జగన్‌లాంటి దుర్మార్గుడికి రాజకీయాల్లో ఉండే అర్హతలేదు. అన్నీ అబద్ధాలే. చెప్పాడంటే.. చేస్తాడంతే అన్నారు. కానీ దానికి భిన్నంగా చెప్పాడంటే చేయడంతే.

చక్కటి ఆదాయాన్ని తెచ్చిపెట్టే అమరావతిని నాశనం చేశాడు. నేను అధికారంలో ఉండగానే 1000 రూపాయల పెన్షన్‌ను 2000లకు పెంచాను. మళ్లీ టీడీపీ వచ్చి ఉంటే 3000 అయ్యుండేది.

మీ స్థానిక ఎమ్మెల్యే రక్షణ నిధి కాస్తా భక్షణ నిధిగా మారిపోయాడు. ఇసుక, భూముల ఆక్రమణ, అటవీ చట్టాల ఉల్లంఘనలతో కోట్లు కూడబెట్డాడు. ఇక్కడ మామిడికి మంచి మార్కెట్‌ ఏర్పాటు చేయాలి. వాళ్లు చేయలేదు..

చేయలేరు కూడా. మళ్లీ తెలుగుదేశం, జనసేనల ప్రభుత్వం వస్తే తప్పకుండా మామిడి ఎగుమతులకు మంచి మార్గాలు అన్వేషిస్తాం. జగన్‌ రాజధానిలో ఇల్లుకట్టుకుని ఇక్కడే ఉంటా అన్నాడు.

అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడుతున్నాడు. ఇతనికి నాశనం చేయడం తప్ప.. నిర్మించడం రాదు.

Another YCP MLC, Vijayasais brother-in-law joined the TDP

ప్రజాసేవ అంటే అర్ధం తెలీదు కానీ.. దోచుకోవడం అంటే మాత్రం బాగా తెలుసు. ఒక్క ఛాన్స్‌ అని అడిగాడు కాబట్టి ఒక్కసారి ఒక్కఛాన్స్‌ ఇచ్చారు. ఈసారి వైసీపీకి అవకాశం ఇస్తే తెలుగుజాతికి ద్రోహం చేసినట్లే.

కాబట్టి ప్రజలారా అందరూ అప్రమత్తంగా ఉండండి. తెలుగుదేశం, జనసేన కూటమిని అఖండ మెజార్టీతో గెలిపించండి మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా నాది.

రాబోయే మూడు నెలల్లో ప్రతి ఒక్కరూ 3,4 గంటలు పనిచేయండి చాలు.. మనం అధికారంలోకి రాగానే మీ భవిష్యత్తును బంగారంలా తీర్చిదిద్దుతా. సంక్షేమీ కార్యక్రమాల అమలు అనేది ఎన్టీఆర్‌తోనే మొదలయ్యాయి.

నేను వచ్చిన తర్వాత వాటిని మరింతగా ముందుకు తీసుకుపోయాను. గత ప్రభుత్వంలో నేను అన్ని వర్గాల ప్రజలకు పండుగలకు తోఫాలు అందించాను. ఇప్పుడు అవి కనుమరుగైపోయాయి. ఈ జలగ ప్రభుత్వం మరోసారి వస్తే ఇబ్బందే అన్నారు.