షర్మిళపై శ్రీరెడ్డి సెటైర్‌లు.. వైసీపీపై క్యాడర్‌ ఫైర్‌…

0
326
Sri Reddys satires on Sharmila are cadre fire on YCP

శ్రీరెడ్డి.. ఈపేరు తెలియని సోషల్‌ మీడియా జనాలు, సినిమా జనాలు లేరంటే అతిశయోక్తి లేదు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్ని సినిమాలు చేసినా రాని పాపులారిటీ ఈమెకు ఒక్కసారిగా సినిమా పరిశ్రమలోని కొందరిపై లైంగిక ఆరోపణలు చేయడం,

నగ్నంగా ఫిలిం ఛాంబర్‌ ముందు కూర్చోవడంతో ఓవర్‌నైట్‌ ఇమేజ్‌ వచ్చి పడిరది. ఇమేజ్‌ మాత్రమే కాదని, ఈమె స్నేహంలో సేద తీరిన పలువురు సినీ సెలబ్రిటీల నుంచి భారీ మొత్తంలో సొమ్ములు కూడా వచ్చిపడ్డాయనేది వాస్తవం.

సోషల్‌ మీడియా వేదికగా బూతులతో రెచ్చిపోతూ వ్యూస్‌ సంపాదిస్తున్న శ్రీరెడ్డి ఆమధ్య రాజకీయాల్లోకి కూడా ప్రవేశించింది. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వై.యస్‌.

జగన్‌మోహన్‌రెడ్డికి వీరాభిమానిగా చెప్పుకునే శ్రీరెడ్డి ఆ పార్టీకి ఫేవర్‌గా చాలా వీడియోస్‌ కూడా చేసింది. అంతేకాదు జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడేవారిమీద, ఆయన రాజకీయ శత్రువుల మీద కూడా ఈమె ఎదురు దాడి చేసింది.

ఆతర్వాత ఏమైందో ఏమోగానీ సడన్‌గా జగన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడిరది. ఇంత చెత్త పాలనను తాను ఎన్నడూ చూడలేదని, ఈ పార్టీకి సపోర్ట్‌ చేసినందుకు సిగ్గు పడుతున్నానని కూడా ఘాటుగా విమర్శించింది.

తాజాగా నిన్నటికి నిన్న జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిళపై వ్యంగ్యాస్త్రాలు విసురుతూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ వీడియో పెట్టింది. ఈ వీడియోలో షర్మిళను అనుకరిస్తూ… తెలంగాణలో వేలుపెట్టి కెలుకుదాం అనుకున్నా..

TDPs disqualification game is over

కానీ వాళ్లు ఆంధ్రాకు తరిమేశారు. కాంగ్రెస్‌లో వేలుపెట్టి కెలుకుదాం అనుకున్నా.. కానీ వారు నన్ను ఆంధ్రాకు తోలేశారు. నాకు ఎంపీ పదవి కావాలి. ఆస్తులో పోగేసుకుందాం అనుకున్నా.. అక్కడున్నది స్వంత అన్న అయినా సరే..

తెలంగాణ వాళ్లను బకరాలను చేద్దాం అనుకున్నా.. కానీ కుదరలేదు. మీరందరూ హిందూమతంలో ఉంటే.. నేను వచ్చి మతం మార్పిచ్చేస్తా.. పార్టీలు మార్పిచ్చేస్తా.. నాకు పుట్టబోయే మనవడికి ఆంధ్రాను రాసిచ్చేస్తా..

అంటూ షర్మిళను వెక్కిరించడం ఇప్పుడు వైసీపీలోనే చర్చకు దారితీసింది. ఎంత రాజకీయ విభేదాలు ఉన్నా స్వంత చెల్లెల్ని ఇలా తన పార్టీకి చెందిన సి గ్రేడ్‌ నాయకులతో తిట్టించడం కరెక్ట్‌కాదని స్వంతపార్టీపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియో శ్రీరెడ్డి స్వంత విషయం అయినప్పటికీ ఆమె గతంలో మనకు సపోర్ట్‌గా మాట్లాడుతూ మన వ్యతిరేకులను బండబూతులు తిట్టినప్పుడు ఆమెను మనం వెనకేసుకురావడం వల్లనే నేడు శ్రీరెడ్డి ఇంతకు తెగించింది అంటూ రాజశేఖరరెడ్డి అభిమానులు కోపగించుకుంటున్నారు.