మంగళవారం ఏపీ రాజకీయాల్లో మరో పెను సంచలనం…

0
200
Another big sensation in AP politics on Tuesday

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. గంటకో బ్రేకింగ్‌ న్యూస్‌ తెరపైకి వస్తోంది. ఎప్పుడు ఏ సంచలన వార్తను ప్రసారం చేయాలా అని అటు మీడియా…

ఎప్పుడు ఏ సంచలన వార్త చూడాలా అని ఇటు ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ఉత్కంఠ సిరీస్‌లో భాగంగా ఇప్పుడు మరో సంచలన వార్త తెరమీదికి వచ్చేసింది.

చంద్రబాబు రాజకీయ జీవితంలో పెను మార్పుకు కారణమైన స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించిన తుది తీర్పు వెలువడటానికి ముహూర్తం ఫిక్స్‌ అయింది. ఈ తీర్పు ఆంధ్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఈ వార్త లోతుల్లోకి వెళితే… చంద్రబాబును ఎట్టిపరిస్థితుల్లోనూ అరెస్ట్‌ చేయాలనే తలంపుతో ఏపీ ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును తెరపైకి తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

ఏపీ రాజకీయాలను ఇది ఒక కుదుపు కుదిపింది. ఈకేసులో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్‌జైలకు పంపిన ప్రభుత్వం ఆయన్ను 52 రోజుల పాటు జైల్లో ఉంచగలిగింది. ఆ తర్వాత ఆయన తాత్కాలిక బెయిల్‌ తెచ్చుకోవటం..

అది పూర్తిస్థాయి బెయిల్‌గా మారడం తెలిసింది. తనపై పెట్టిన ఈకేసు 17`ఎ కిందకు వస్తుందని, ఇది పూర్తిగా రాజకీయ కక్షతో కూడిన కేసు అని,

ఈ సెక్షన్‌ కింద తనపై కేసు పెట్టాలంటే గవర్నర్‌ అనుమతి తప్పనిసరి అని, సీఐడీ పూర్తిగా నిబంధనలు పాటించకుండా పెట్టిన ఈ కేసును కొట్టి వేయాలని ఆయన కోర్టు తలుపు తట్టారు.

Chandrababus picture was thrown down by the TDP state leader

సుప్రీంకోర్టు ఈకేసును పలుమార్లు విచారించింది. గత అక్టోబర్‌ 20న తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే ఈ కేసు తీర్పును మంగళవారం (16)నాడు వెల్లడిరచనున్నట్లు జస్టిస్‌ అనిరుధ్‌, జస్టిస్‌ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం శనివారం వెల్లడిరచింది.

ఒకవేళ ఈ కేసులో చంద్రబాబుకు అనుకూలంగా ఈ కేసు 17`ఎ కిందకు వస్తుందని కనుక కేసును కొట్టి వేస్తున్నట్టు కోర్టు తీర్పును వెలవరిస్తే.. ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో ఇది పెద్ద సంచలనమే అవుతుంది.

ఎందుకంటే చంద్రబాబుపై ఈ కేసుతో పాటు పెట్టిన మరో మూడు కేసులు కూడా ఇదే చట్టం కిందకు వస్తాయి గనుక అవి కూడా క్వాష్‌ అయిపోయినట్లే.

అప్పుడు చంద్రబాబు తనను రాజకీయ కక్షతో జైలుకు పంపారని, తాను ఏ తప్పూ చేయలేదని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇది అధికార వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి.

అలా కాకుండా ఇది 17`ఎ కిందకు రాదు కనుక క్వాష్‌ పిటీషన్‌ను కోర్టు అనుమతిస్తే చంద్రబాబుపై జగన్‌ ప్రభుత్వం మరిన్ని కేసులు పెట్టే అవకాశం లేక పోలేదు.

మొత్తానికి ఏపీ రాజకీయాలు మంగళవారం సుప్రీం వెలువరించే తీర్పుపై ఆధాపడి ఉన్నాయన్నమాట.