కేటీఆర్‌ ఇంకా ఆ భ్రమల్లోంచి బయటకు రావట్లేదు..

0
311
KTR will not deserve the present situation

అంతన్నాడిరతన్నాడే లింగరాజు… గంపకింద ముంతన్నాడే లింగరాజు.. అన్నట్లుంది తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వ్యవహారం.

9 ఏళ్ల పాలనలో 60 వేల కోట్ల మిగుల బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను లక్షల కోట్ల అప్పులకు చేర్చింది కేసీఆర్‌ కుటుంబం అనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తూనే ఉన్నాయి. అయితే తాము మాత్రం తెలంగాణకు లక్షల కోట్ల ఆస్తులు సృష్టించామని చెబుతున్నారు కేటీఆర్‌.

KTR will not deserve the present situation

అది హైదరాబాద్‌లో సాధ్యమే

ఆదివారం బీఆర్‌ఎస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ‘స్వేద పత్రం’ విడుదల చేశారు కేటీఆర్‌.
ఈ సందర్బంగా బోడి గుండుకు, మోకాలికి ముడిపెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణలో తాము కట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వల్ల దేశంలోనే భూగర్భ జలాలు పెరిగాయట.

ఇదేమన్నా అసలు నమ్మశక్యంగా ఉందా. ఒక ప్రాజెక్ట్‌ కడితే దాని పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి కానీ దేశ వాప్తంగా ఎలా పెరుగుతాయో కేటీఆర్‌కు మాత్రమే తెలుసనుకుంటా. ఇలాంటి అర్ధం పర్ధం లేని మాటలు చెప్పి, ప్రజలను నమ్మించాలని ప్రయత్నించి ఓటమిని కొని తెచ్చుకున్నారు.

అయినప్పటికీ తాము అధికారంలో ఉన్న కాలంలో ఏది చెబితే అది రాసుకున్న, ప్రసారం చేసిన మీడియా సంస్థలే ఉన్నాయనే భ్రమల్లోంచి భయటకు రావట్లేదు కేటీఆర్‌.

గతంలో పాత్రికేయుల సమావేశంలో ఈయనగారి తండ్రి కేసీఆర్‌ కూడా పాత్రికేయులకు నోటికి ఏది వస్తే అది చెప్పేవారు. అదెలా? అని ప్రశ్నించిన జర్నలిస్ట్‌లపై విరుచుకుపడుతూ.. నీదేపేపరు.. సోయలేదా? ఇలాంటి హల్కా జర్నలిస్ట్‌లు అక్కడక్కడా ఉంటారు..

నా మొదడు చుక్క చుక్క ఖర్చుపెట్టి కాళేశ్వరం కడితే నీ కనిపిస్తల్లేదా? అంటూ ఎదురు దాడికి దిగేవారు. అధికారంలో ఉన్నామన్న ధైర్యం అప్పట్లో అలా మాట్లాడిరచింది.

కేటీఆర్‌ ఇంకా మాట్లాడుతూ.. అంత పెద్ద ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన ఒక బ్యారేజ్‌లో చిన్న తప్పుంటే మొత్తం ప్రాజెక్ట్‌నే తప్పుపడుతున్నారు అనడం మరింత నవ్వులపాలు అవుతోంది.

ఒక బ్యారేజ్‌ కుంగిపోవడం చిన్న విషయం అన్న కేటీఆర్‌ వ్యాఖ్యలు ఆయనలోని అపరిపక్వతను తెలియజేస్తోందని విమర్శిస్తున్నారు.