వర్మను నమ్ముకుని పరవుపోగొట్టుకున్నాం బాసూ…

0
212
Basu we lost our pride by trusting Varma

రామ్‌గోపాల్‌ వర్మను గుడ్డిగా నమ్మితే ఎలా ఉంటుందో బాగా తెలిసొచ్చింది వైసీపీకి. ఆయన మాటలు నమ్మి ముందుకు వెళ్లడం అంటే కుక్క తోకను పట్టుకుని గోదారి ఈదినట్టేనని ఆ పార్టీ నాయకులు ఆఫ్‌ ది రికార్డుగా మాట్లాడుకుంటున్నారు.

2024లో వైసీపీ గెలుపుకు దోహపడే విధంగా, అదే సమయంలో అటు తెలుగుదేశం పార్టీని, ఇటు జనసేన పార్టీని పలుచన చేసే విధంగా దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘వ్యూహం’. అనేక వివాదాల నడుమ ఈ చిత్రం తెరకెక్కింది.

Basu we lost our pride by trusting Varma

వనదేవతల జాతరకు భారీ ఏర్పాట్లు…

ఈ సినిమాను నిలుపుదల చేయాలంటూ అటు వర్మ చిరకాల శత్రువు, వర్మ మాజీ నిర్మాత నట్టికుమార్‌ కోర్టులను ఆశ్రయించగా, తమ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగే విధంగా తమను పోలిన రియలిస్టిక్‌ క్యారెక్టర్‌లను వర్మ ఈ సినిమాలో వాడారని నారా లోకేష్‌ కోర్టును ఆశ్రయించారు.

దీనిపై కోర్టు ఈనెల 27న తీర్పు వెలువరించనుంది. అయితే తాజాగా నిన్న (ఆదివారం) ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను ‘జగ గర్జన’ పేరుతో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. వేలాది మందికి సరిపడా సౌకర్యాలను కల్పించారు.

అయినప్పటికీ వందల సంఖ్యలో మాత్రమే జనాలు హాజరయ్యారు. వీరిలో కూడా అత్యధిక శాతం వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, వారు తెచ్చిన జనాలే కావడం విశేషం. ప్రజల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో సాయంత్రం 4 గంటలకు జరపాల్సిన వేడుకను 8 రాత్రి ఎనిమిది గంటలకు మొదలు పెట్టారు.

అప్పటికీ జనాలు లేకపోవడంతో సేడియం మొత్తం ఏర్పాటు చేసిన లైటింగ్‌ను ఆఫ్‌ చేసి, కేవలం సభావేదిక వరకూ పరిమితం చేశారు. దీనివల్ల వేలాదిగా వేసిన కుర్చీలు, ఆల్రెడీ స్టేడియంలోని గ్యాలరీలు ఖాళీగా ఉండడాన్ని మీడియా కంట పడకుండా చేయాలని చూశారు.

ఈ విషయమై విజయవాడకు చెందిన ఓ వైసీపా నాయకుడు ఆఫ్‌ ది రికార్డుగా మాట్లాడుతూ… వర్మను నమ్ముకుని పరువు పోగొట్టుకున్నాం బాసూ..

వాడి సంగతి తెలిసి కూడా మా వాళ్లు అనవసరంగా భారీ ఏర్పాట్లు చేశారు. ఆఖరికి వాలంటీర్ల వల్ల కూడా కాలేదు జనాల్ని తీసుకురావడం.

అయినా రెండు ప్రధాన రాజకీయపార్టీలకు, స్థానికంగా ఉన్న రెండు పెద్ద సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు వ్యతిరేకంగా తీసిన సినిమా ఫంక్షన్‌కు ప్రజలు భారీ ఎత్తున ఎలా వస్తారు. మా వాళ్లకు బుర్రలేదు. ఆ వర్మగాడు భారీ ఏర్పాట్లు చేసుకోండి..

నేను జనాల్ని ఎలా రప్పిస్తానో మీరు చూడండి అని రెగ్యులర్‌గా చేసే పబ్లిసిటీ స్టంట్‌ చేశాడట. వాడు చెప్పింది చేయడు.. చేసేది చెప్పడు అని అందరికీ తెలుసు మా వాళ్లకు తప్ప.. ఏం చేస్తాం ఖర్మ’’ అన్నాడు. దీనిబట్టి అర్ధం చేసుకోవచ్చు వర్మ వైసీపీ గాలిని ఏ రేంజ్‌లో తీసేశాడో.