టీడీపీ గెలుపు గుర్రమని ఒప్పుకున్న వైసీపీ

0
241
YCP admitted that TDP is the winning horse

నోటి దూల కొద్ది మనం చేసే కామెంట్స్‌ ఒక్కోసారి అటు తిరిగి, ఇటు తిరిగి మనల్నే ఇరికించేస్తుంటాయి. అందులోనూ రాజకీయల్లో అయితే మరీను.

కాబట్టి ఈ ఫీల్డ్‌లో వీలనైనంత వరకూ ఏదైనా విషయంపై స్పందించాలంటే ఒకటికి పదిసార్లు గతంలోకి వెళ్లి మరీ ఆలోచించాలి. లేకపోతే గతంలో మనం చేసిన వ్యతిరేకించిన విషయాలనే ఇప్పుడు మనం సమర్ధించాల్సి వస్తుంది.

ఇక తాజా విషయానికి వస్తే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గురించి అధికార వైసీపీ అనేక కామెంట్స్‌ చేస్తూ వస్తోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అయితే ఏకంగా టీడీపీ నథింగ్‌.. చంద్రబాబు నథింగ్‌ అని, ఆ పార్టీ గెలవడం అనేది అసాధ్యం..

YCP admitted that TDP is the winning horse

ప్రశాంత్ కిషోర్ కి మూడు నెలలకు 100 కోట్ల డీల్ ఇచ్చిన చంద్రబాబు!

చచ్చిన శవంతో సమానం టీడీపీ అని కొందరు నాయకులు కూడా నోటికి వచ్చినట్లు అన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పుంజుకున్న తీరుతో కొంత వరకూ వెనక్కి తగ్గారు.

ఇప్పుడు ప్రశాంత్‌ కిషోర్‌ విషయంలో వైసీపీ చేస్తున్న కామెంట్లతో టీడీపీ గెలుపు గుర్రం అని తమకు తామే ఒప్పుకున్నట్లు అయ్యింది.

మొన్నటికి మొన్న ప్రశాంత్‌ కిషోర్‌ వెళ్లి చంద్రబాబును కలిశారు. ఇది ఏపీ రాజకీయాల్లో చర్చోపచర్చలకు దారి తీసింది. ఈ కలయికను జీర్ణించుకోలేని వైసీపీ మీడియా, సాక్షి పేపర్లు తమ అక్కసును వెళ్లగక్కాయి.

ఈ క్రమంలో ప్రశాంత్‌ కిషోర్‌ అనేవాడు పెద్ద పోటుగాడు కాదు అని, 2014లో బీజేపీ అధికారంలోకి రాబోతోందని,

అది గెలుపు గుర్రం కాబోతోందని ఆ పార్టీకి స్ట్రాటజిస్ట్‌గా డీల్‌ కుదుర్చుకున్నారని, అలాగే ఢల్లీిలో ఆప్‌ పార్టీ గెలుపు గుర్రం కాబోతోందని ఆ పార్టీకి స్ట్రాటజిస్ట్‌గా వెళ్లారని, పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు గుర్రం అవుతుందని తెలిసి,

ఆ పార్టీకి స్ట్రాటజిస్ట్‌గా మారారని, తమిళనాడులో డీఎంకే విజయం సాధించబోతోందని గ్రహించే ఆ పార్టీకి పనిచేయడానికి ఒప్పుకున్నాడని,

ఆంధ్రలో వైసీపీ సునామీ సృష్టించబోతోందని పసిగట్టి మా పంచన చేరారని, పశ్చిమబెంగాల్‌లో మమతకు గెలుపు అవకాశాలు మెండుగా ఉండటంతో తృణమూల్‌ కాంగ్రెస్‌కు పనిచేశారు గానీ ఆయన సలహాలు సూచనలతోనే ఏ రాష్ట్రంలోనూ అధికారం దక్కలేదు అంటూ కథనాలు రాసుకొచ్చారు.

దీన్ని బట్టి చూస్తే ప్రశాంత్‌ కిషోర్‌ ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతోందని ముందే పసిగడతారని, ఆయన అంచనాలు నిజమౌతాయని వైసీపీ అనుకూల మీడియా వెర్షన్‌. వారి వెర్షన్‌ ప్రకారం చూస్తే.. ఇప్పుడు ప్రశాంత్‌ కిషోర్‌

చంద్రబాబును కలవడం అంటే రేపు జరగబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు గుర్రమని ఒప్పుకున్నట్లే కదా.. అందుకే అంటారు నోరుంది కదా అని ఏది బడితే అది వాగకూడదు. పెన్నుంది కదా అని ఏదిబడితే అది రాయకూడదు అని.