సుమ కొడుకుతో పోరాడుతున్న సునీత కొడుకు

0
331
anchor suma son

యాంకర్ గా సుమారు రెండు దశాబ్దాల పై నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతున్న సుమ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈమెతో పాటు కెరీర్ ని ప్రారంభించిన వాళ్లంతా ఇండస్ట్రీ ని వదిలి ఎప్పుడో వెళ్లిపోయారు. మరి కొంతమంది యాంకర్స్ యాంకరింగ్ రంగం వదిలేసి సినిమాల్లో నటులుగా కొనసాగుతున్నారు.

కానీ సుమ మాత్రం అప్పట్లో ఎంత డిమాండ్ తో అయితే ఇండస్ట్రీ లో కొనసాగేదో, ఇప్పటికీ అంతే డిమాండ్ తో కొనసాగుతుంది. ఈమె లేని ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు. ఎంటెర్టైమెంట్ షోస్ కి కూడా కచ్చితంగా సుమ కావాల్సిందే. అలాంటి సుమ కి కొడుకుగా రోషన్ అతి త్వరలోనే ‘బబుల్ గమ్ ‘ అనే సినిమా తో మన ముందుకు రాబోతున్నాడు.

anchor suma son

అప్పుడే ఓటీటీ లోకి ‘ఆదికేశవ’.. కారణం అదేనా

ఈ సినిమా ప్రొమోషన్స్ లో సుమ ఫుల్ బిజీ గా ఉంటుంది. ఈమె కొడుకుని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు, ఇతనేంటి ఇలా ఉన్నాడు అంటూ. సుమ చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా అందగాడే..కానీ వీళ్ళ కొడుకు రోషన్ చూసేందుకు కనీసం సైడ్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరాడే, ఇతను హీరో ఏంటి మన ఖర్మ అని అనిపించక తప్పదు. ఆ రేంజ్ లుక్స్ తో ఉన్నాడు.

ఇతనికి పోటీ గా మరొకరు తయారు అయ్యాడు. సింగర్ గా ఎన్నో వందల సినిమాలకు తన అద్భుతమైన గాత్రం అందించి మంచి క్రేజ్ , డిమాండ్ సంపాదించిన సునీత కొడుకు ఆకాష్ గోపరాజ్ కూడా అతి త్వరలోనే ‘సర్కారు నౌకరి’ అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. సునీత ఎంత అందం గా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఈ వయస్సులో ఇప్పటికీ కూడా ఆమె ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆమె మాజీ భర్త కూడా అందగాడే. వీళ్లిద్దరి కొడుకు అంటే ఏ రేంజ్ లో ఉండాలి..?, ఆ రేంజ్ లో మాత్రం కనీసం పావు శాతం కూడా లేరు.

ఇలా టీవీ లో ప్రశాంతం గా ఇష్టమైన ప్రోగ్రాం చూద్దాం అనుకునే వారికి, ప్రతీ ప్రోగ్రాం లో వీళ్లిద్దరు ఎంటర్ అయ్యి తమ సినిమాలకు ప్రొమోషన్స్ చెయ్యడం చూసి, ఐడెమ్ ఖర్మరా బాబు, వీళ్ళు హీరోలు ఏంటి అని అనిపించేలా చేస్తున్నారు. అలా కొంతమంది హీరోలను కూడా గతం లో అనుకున్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు సూపర్ స్టార్స్ అయ్యారు. వీళ్ళు కూడా అలా అవుతారో లేదో చూడాలి.