పవన్ కళ్యాణ్ కోసం లక్షలు పెట్టి వజ్రం..!

0
666

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు రాష్ర్టాలతో పాటు దేశం యావత్తు పరిచయం అవసరం లేదని పేరు. సినిమాల్లో బిజీగా ఉంటూనే పాలిటిక్స్ లో కూడా రాణిస్తున్నారు. ఏపీ పాలిటిక్స్ లో గేమ్ ఛేంజర్ గా కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో కొనసాగుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుంది. ఇది పిరియాడికల్ మూవీ అని చిత్ర యూనిట్ ఎప్పుడో స్పష్టం చేసింది. దీంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ భారీ వ్యూవ్స్ తో దూసుకుపోతున్నాయి.

సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న వైనం

ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదేంటో ఇక్కడ చూద్దాం. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి టీజర్ ను డిసెంబర్ 31, 2022న విడుదల చేయాలనుకుంది చిత్ర యూనిట్ కానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇంకా పెండింగ్ లో ఉండడంతో టీజర్ రిలీజ్ ను వాయిదా వేయాల్సి వచ్చింది.

బాలయ్య రికార్డులను బ్రేక్ చేసిన మెగాస్టార్

అయినా ఈ చిత్రం షూటింగ్ మాత్రం వేగంగా కొనసాగుతుంది. అయితే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున, ఇంకా పవన్ కళ్యాణ్ చేతిలో మరిన్ని ప్రాజెక్టులు ఉండడంతో మరింత వేగంగా షూటింగ్ కొనసాగుతుంది. పాన్ ఇండియా లెవల్ లో విడుదలచేసే ఈ చిత్రం షూటింగ్ విషయంలో చిత్ర యూనిట్ ఆచి తూచి వ్యవహరిస్తోందట.

రూ. 30 లక్షలు పెట్టి కోహినూర్ నమూనా వజ్రం

ఏఎం రత్నం ప్రొడక్షన్ లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్ ఏకంగా రూ. 30 లక్షలు ఖర్చుపెట్టి కోహినూర్ డైమండ్ లాంటి వజ్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇది పీరియాడికల్ ఫిక్షన్ మూవీ కాబట్టి, కథ అంతా ఔరంగాజేబుకు సంబంధించి హిస్టారికల్ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి ఇందులో కోహినూర్ వజ్రం కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది. ఏ అంశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు క్రిష్. అందుకే కోహినూర్ లాంటి వజ్రం కొనుగోలు చేసేందుకు రూ. 30 లక్షలు ఖర్చు పెట్టారట ఏఎం రత్నం. ఈ సినిమా కథ కూడా కోహినూర్ వజ్రం చుట్టే తిరుగుతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

దీని వెనుక భారీ ప్లాన్

ఇది ఎంత వరకూ నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై చాలా మంది భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏఎం రత్నం ఇంత ఖర్చు పెట్టడం వెనుక భారీగానే ప్లాన్ ఉందని చెప్పుకుంటున్నారు. భారీ అంచనాల మధ్య చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా హరిహర వీరమల్లు త్వరగా రిలీజై బాక్సాఫీస్ హిట్ కొట్టాలని పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరా వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని లీకులు వినిపిస్తున్నాయి.

ఇక పవన్ కళ్యాణ్ కి సరైన హిట్ లేకపోవడంతో.. ఈ సినిమాపైనే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గత చిత్రాలు అన్ని యావరేజి సినిమాలు గా నిచ్చిన విషయం తెలిసిందే.