సినిమాల్లోకి దిల్ రాజు సెకండ్ వైఫ్.. కోట్లు కుమ్మరించనున్న స్టార్ ప్రొడ్యూసర్..!

0
419

అప్పట్లో టాప్ హీరోలుగా చేసిన నాగేశ్వర్ రావు, ఎన్టీఆర్, తదితర హీరోల నటనా వారసత్వం పంచుకునేందుకు వారి కొడుకులు సీనీ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఈ తంతు కామన్ గా కనిపిస్తుంది. వారి తరం ముగిసిన తర్వాత మరో తరం ఇలా సాగుతూనే ఉంది. వారసులు కూడా తమ నటనా కౌశల్యాన్ని పెంచుకుంటూ తండ్రుల కంటే ఎక్కువ క్రేజ్ నే సంపాదించుకుంటున్నారు. కానీ ఈ మధ్య అవి మరీ విపరీతంగా పెరిగాయి. ఇందులో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, మ్యూజిక్ డైరెక్టర్లూ తక్కువ తినలేదు. వారి పుత్రులు, పుత్రికలను కూడా ఇండస్ర్టీకి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఓ స్టార్ ప్రొడ్యూసర్ తన వైఫ్ ను చిత్ర రంగంలోకి తీసుకచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడని లీకులు వినిపిస్తున్నాయి.

వారసత్వంతో నిండిన ఇండస్ర్టీ

టాలీవుడ్ ఇండస్ర్టీలో వారసత్వ ఎంట్రీకి కొదువ లేదు. తండ్రుల తర్వాత పుత్రులు, తల్లుల తర్వాత కూతుళ్లు. బయటి నుంచి వస్తున్న వారు చాలా వరకు నెగ్గుకు రాలేకపోతున్నాయి. విజయ్ దేవరకొండ మాత్రం ఇండస్ర్టీకి ఎటువంటి వారసత్వం లేకుండా వచ్చి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ మధ్య సెలబ్రెటీల పిల్లలే కాకుండా వారి వైఫ్ లను కూడా తీసుకచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆమె రాక కోసం స్టార్ ప్రొడ్యూసర్ ఖర్చు

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. ‘శ్రీ వేంకటేశ్వర్ క్రియేషన్స్’ బ్యానర్ ఏర్పాటు చేసి అందులో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథను ఎంచుకొని మంచి డైరెక్టర్ తో తెరకెక్కించడంలో ఆయనది అందవేసిన చెయ్యనే చెప్పాలి. ఆయన మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. తనకన్నా చాలా చిన్న వయస్సున్న తేజస్వినిని తన లైఫ్ లోకి ఆహ్వానించాడు దిల్ రాజు. అయితే ఆమెను ఇండస్ర్టీకి పరిచయం చేసేందుకు తహతహ లాడుతున్నాడని ఇండస్ర్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె కూడా మూవీస్ లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారట. ఆమె కోరిక తీర్చేందుకు దిల్ రాజు కూడా కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.

ఇండస్ర్టీని ఆశ్చర్యానికి గురి చేస్తున్న రూమర్

దిల్ రాజు కంటే చాలా తక్కువ వయస్సుంటుంది తేజస్వినికి. ఆమెకు చిన్నతనం నుంచి యాక్టింగ్ పై ఇంట్రస్ట్ ఉందట. కానీ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారో..? ఒప్పుకోరో..? అనే సందేహంతో ఇన్నాళ్లు చెప్పలేదట. ఈ మధ్య ఆమె తల్లి అయ్యింది. తన ఇంట్రస్ట్ ను భర్తకు చెప్పడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇక ఆమెను మోడలింగ్ లో దించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

అన్ని కుదిరితే ఆ పాత్రల్లో

అన్ని సవ్యంగా కుదిరితే ఆమెను హీరోయిన్ గా కానీ, మంచి స్కోప్ ఉన్న పాత్రలో కానీ తీసుకచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. భార్యను అర్థం చేసుకొని ఆమె కోరుకున్న రంగంలో రాణించేందుకు దిల్ రాజు చేస్తున్న కృషిని నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా ఈ రూమర్ పై దిల్ రాజు ఇప్పటి వరకూ ఎలాంటి కామెంట్ చేయలేదు.