ఆది పురుష్ పై కృతి సనన్ కామెంట్.. తన పాత్రపై స్పందించిన భామ..!

0
357

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లెటెస్ట్ మూవీ ‘ఆది పురుష్’. శ్రీరాముడి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు మనకు తెలిసిందే. దాదాపుగా నెల క్రితం అఫీషియల్ గా ట్రైలర్ రిలీజైంది. ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినా ప్రభాస్ చిత్రం, అందులో విషేశాల గురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఆసక్తిని కనబరుస్తూనే ఉన్నారు. ఏదైనా కొత్త అప్డేట్ వస్తే బాగుండని ఆసక్తిని కనబరుస్తున్నారు.

వరుసగా కమర్షియల్ హిట్లు

ఆది పురుష్ కు ఓ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తుండగా, సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. మహేశ్ హీరోగా వచ్చిన ‘వన్’లో కృతి నటించి మెప్పించింది. కృతి మోడల్, చాలా యాడ్స్ లలో కనిపించింది. తెలుగులోనే ఎంట్రీ ఇచ్చినా ఎక్కువగా బాలీవుడ్ మూవీస్ లో నటించింది కృతి. ఆమె చిత్రాలు వరుసగా కమర్షియల్ హిట్లు సాధించాయి కూడా. ఆమెకున్న క్రేజ్, పాత్ర పరంగా ఆమె చూపించే అభినయానికి ఫిదా అయిన ఓం రౌత్ ఆది పురుష్ లో సీత పాత్రకు ఎంపిక చేశారంట.

అదొక అద్భుతమైన ప్రపంచం

ఇక సాక్షాత్తు సీతా అమ్మవారి పాత్రలో నటించాలంటే ఎంతో బాధ్యతతో కూడుకున్నదని చెప్పుకొచ్చింది కృతి. ఈ సినిమా నా కేరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఇందులో నా పాత్రను నేను ఎప్పటికీ మరిచిపోను అంటుంది చిన్నది. సెట్ లోకి ప్రవేశించగానే అమ్మవారిని ధ్యానం చేసుకోవడం. ప్యాకప్ చెప్పగానే కొంచెం నిట్టూర్పుగా వెళ్లడం జరుగుతూనే ఉందని చెప్పుకొచ్చింది. షూటింగ్ సమయంలో అదొక అద్భుతమైన ప్రపంచంలా అనిపించేది. ఇక ఇద్దరి మధ్య కెమిస్ర్టీ బాగా వర్కవుట్ అయ్యిందని, చిత్రం సూపర్ హిట్ సాధించడం ఖాయమని చెప్పుకచ్చింది కృతి.