సంక్రాంతికి ఒక్క థియేటర్ ని కూడా మిగల్చకుండా ‘గుంటూరు కారం’ కి బుక్ అయిపోయాయి..

0
258
For Sankranti Guntur Karam has been booked without leaving a single theater

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి ఇప్పటికే ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు ఈ మధ్య కాలం లో ఇంత నాటు మాస్ లో కనిపించడం చూడలేదని,

అన్ని లిమిట్స్ ని దాటి త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో సినిమా విడుదల ముందే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రం లో మహేష్ బాబు గుంటూరు అండర్ వరల్డ్ డాన్ గా కనిపించబోతున్నాడు.

సంక్రాంతికి అత్యధిక ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న చిత్రం ఇదే. సుమారుగా 137 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని ఈ చిత్రం జరుపుకున్నట్టు టాక్ వినిపిస్తుంది.

ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ప్రీమియర్స్ లో ఆల్ టైం రికార్డు గ్రాస్ ని నెలకొల్పడానికి ఈ చిత్రం సిద్ధంగా ఉన్నట్టుగా ట్రెండ్స్ చెప్తున్నాయి.

Poonam satires on Guntur Karam again

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాతో పాటుగా మరో మూడు సినిమాలు కూడా సంక్రాంతికి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

ఇన్ని సినిమాల మధ్య మా సినిమా వస్తుంది, రికార్డు మిస్ అవుతుందేమో, దయచేసి భారీ రిలీజ్ ఇవ్వండి అంటూ ట్విట్టర్ లో మహేష్ ఫ్యాన్స్ నిర్మాతలను బ్రతిమిలాడుకున్నారు.

దానికి వంశీ మాట్లాడుతూ ‘కనీవినీ ఎరుగని రేంజ్ రిలీజ్ మన సినిమాకి ఉండబోతుంది. హైదరాబాద్ లో ఇప్పటికీ 90 శాతం కి పైగా థియేటర్స్ ని దిల్ రాజు గారు లాక్ చేసేసాడు.

కాబట్టి ఎలాంటి టెన్షన్ పడకండి, సెలెబ్రేషన్స్ ఎలా చెయ్యాలో ప్లాన్ చేసుకోండి, థియేటర్స్ సంగతి మేము చూసుకుంటాం’ అంటూ వంశీ చెప్పుకొచ్చాడు.

అయితే ఈ సినిమా దాటికి అదే రోజు విడుదల అవుతున్న ‘హనుమాన్’ చిత్రానికి భారీ నష్టం కలుగుతుంది. ఈ సినిమా మీద కూడా మార్కెట్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

కానీ దిల్ రాజు ఈ చిత్రానికి హైదరాబాద్ లో కేవలం నాలుగు సింగిల్ స్క్రీన్స్ ని మాత్రమే వదిలి మొత్తం గుంటూరు కారం కి బ్లాక్ చేసాడు. ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ గుంటూరు కారం మేకర్స్ పై విరుచుకుపడుతున్నారు.