విజయ నిర్మల అసలు స్వరూపం బయటపెట్టిన రమ్య

0
984

ఈ మధ్య కాలంలో బాగా వినిపించే పేర్లు నరేశ్ పవిత్రా లోకేశ్. ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వీరి గురించి ఏ విషయం తెలిసినా తెగ వైరల్ చేస్తున్నారు వైరల్ రాయుళ్లు. ఇక వీరి మధ్య వినిపిస్తున్న మరో పేరు నరేశ్ మూడో భార్య రమ్యా రఘుపతి. తాము పెళ్లి చేసుకుంటామని పవిత్రా లోకేశ్ నరేశ్ ప్రకటించడం, తనకు విడాకులు ఇవ్వకుండా ఎలా పెళ్లి చేసుకుంటావో చూస్తా అంటూ రమ్యా రఘుపతి వారించడం ఇలా ట్రయాంగిల్ స్టోరీ ఇండస్ట్రీకి గాసిప్ లను తెచ్చిపెడుతూనే ఉంది.

విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదట

డిసెంబర్ 31 వేడుకల్లో లిప్ లాక్ వీడియో రిలీజ్ చేసిన నరేశ్-పవిత్రా లోకేశ్ తాము పెళ్లికి సిద్ధమైనామని అందుకే ఈ లిప్ లాక్ వీడియో విడుదల చేసినట్లు చెప్పకనే చెప్తున్నా.. అదంతా ఒక మూవీ కోసం ప్రమోషన్ ట్రెండ్ అంటూ మరో వాదన వినిపిస్తుంది. ఇక రమ్య రఘుపతి మాత్రం నరేశ్ కు విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని, నాలుగో పెళ్లి ఎలా చేసుకుంటాడో చూస్తానని సవాల్ చేస్తుంది. రమ్య కూడా తన అత్తింటి విషయాలను ఒక్కొక్కటిగా బయట పెడుతూ సంచలనాటే సృష్టిస్తుంది.

విజయ నిర్మల గురించి

రమ్య రఘుపతి ఈ మధ్య ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆమె అత్త విజయ నిర్మల గురించి ఆమె చెప్పిన తీరును నిజంగా హ్యాట్సాఫ్ మరి. ‘తన కొడుకు రెండో పెళ్లి కూడా పెటాకులు అయిన తర్వాత తనను మూడో భార్యగా ఎంచుకున్నాడు నరేశ్. ఇక ఆయనను పెళ్లి చేసుకొని కోడలిగా విజయ నిర్మల ఇంటిలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆవిడ నన్ను బాగా చూసుకున్నారు. ఒక మహారాణిలాగా అనే చెప్పాలి.

కోడలిగా కాకుండా కూతురిగా ఎక్కువ ప్రేమగా చూసుకున్నారు. ఎప్పుడు మాట్లాడినా అమ్మా అని పిలిచేదాన్ని. ఎప్పుడూ తనను కోడలిగా చూడలేదు ఆమె. ఇద్దరం కలిసి అన్ని పనులు చూసుకునేవాళ్లం. గంటల కొద్దీ కబుర్లు కూడా చెప్పుకునేవాళ్లం. అందులో ఆమె లైఫ్ గురించి తను ఎదుర్కొన్న కష్టాలు, నష్టాల గురించి చాలా విషయాలు చెప్పుకచ్చేది. చాలా సీక్రెట్స్ ను నాతో షేర్ చేసుకుంది.

చాలా సీక్రెట్ పంచుకున్నారు

విజయ నిర్మల మంచి వ్యక్తిత్వం ఉన్న వారు. ఆమెతో మాట్లాడితే చాలా విషయాలు తెలిసేవి. జీవితం, కాపురం, కలివిడితనం అన్నింటి గురించి చెప్పేవారు. కానీ ఆమెలో ఉన్న ఎమోషన్స్, ప్రేమ, జాలి, దయ లాంటివి మాత్రం నరేశ్ లో లేవు. నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమె నా పట్ల మరింత కేర్ గా ఉండేది. ఈ పని చేయద్దు, ఆపని చేయద్దు అంటూ వారించేది కూడా.

ఎత్తుకొని చాలా మురిసిపోయింది

నాకు కొడుకు పుట్టాక చాలా సంతోష పడింది. తనే మొదలు ఎత్తుకొని చాలా మురిసిపోయింది. ఆమె బతికి ఉంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. నరేశ్ ను వారించేది, కానీ ఆమె లేకపోవడం నా జీవితంలో ఇలాంటి మలుపులకు కారణం అయ్యింది. ’ అంటూ తన అత్తగారి గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది రమ్య రఘుపతి.

ఏది ఏమైనా నరేశ్ ను నాలుగో పెళ్లి చేసుకోనివ్వనని, ఆయనకు విడాకులు ఇచ్చేది జరగదని చెప్పుకచ్చింది. విడాకులు ఇవ్వకుండా నాలుగో పెళ్లి ఎలా చేసుకుంటాడో చూస్తానని సవాల్ విసురుతోంది. కానీ నరేశ్ పవిత్రా లోకేశ్ మాత్రం ఇంకా లివింగ్ లో ఉంటూ వారి జర్నీని మాత్రం కొనసాగిస్తున్నారు. పెళ్లి టాపిక్ ను పదే పదే తెస్తూ ఇండస్ట్రీలో వార్తల్లో నిలుస్తున్నారు.