వైఎస్ షర్మిల కి ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు..!

0
328
AP Congress party reins to YS Sharmila

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర మరియు తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉండేదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాం లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఉండేది.

ఎప్పుడైతే ఆయన చనిపోయాడో అప్పటి నుండే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది. రాష్ట్రం రెండు గా విడిపోవడం, ఆంధ్ర లో కాంగ్రెస్ పార్టీ జీరో అవ్వడం వంటివి జరిగాయి.

AP Congress party reins to YS Sharmila

జగన్ కి పోటీ గా లోకేష్ ని నిలిపేందుకు ప్రశాంత్ కిషోర్ మాస్టర్ ప్లాన్!

ఈ పదేళ్ల గ్యాప్ లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తాన్ని జగన్ లాగేసుకున్నాడు. వైసీపీ పార్టీ ని స్థాపించి ఆంధ్ర ప్రదేశ్ లో 150 స్థానాలతో ప్రభుత్వాన్ని స్థాపించాడు.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో అధికారం లోకి వచ్చింది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో బలోపేతం అయ్యేందుకు చూస్తుంది. త్వరలోనే ఆంధ్ర రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం చూస్తాం అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు.

అందుకు కారణం కూడా లేకపోలేదు. అసలు విషయం లోకి వెళ్తే కొంతకాలం క్రితం సీఎం జగన్ సోదరి, వై ఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ని స్థాపించింది. కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పెట్టుకొని ఆమె ఎన్నికల బరిలో నిలుద్దాం అని అనుకుంది.

కానీ ఆమె పార్టీ కి అంత సత్తా లేకపోవడం తో కాంగ్రెస్ పార్టీ పొట్టుని నిరాకరించి, ఆంధ్ర ప్రదేశ్ లో నిన్ను కాంగ్రెస్ పార్టీ చీఫ్ ని చేస్తాము. 2029 ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీ కి ఆంధ్ర లో నువ్వే పూర్వ వైభవం తీసుకొని రావాలి అని ఒక పెద్ద బాధ్యతలను షర్మిల కి అప్పజెప్పారట.

ఈ ప్రతిపాదన నచ్చి ఆమె తెలంగాణ ఎన్నికల నుండి తప్పుకొని , కాంగ్రెస్ పార్టీ కి సంపూర్ణ మద్దతు తెలిపింది. త్వరలోనే ఆమెకి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందనున్నాయి.

ఆంధ్ర రాజకీయాల్లో షర్మిల అడుగుపెడితే కచ్చితంగా వైసీపీ పార్టీ కి పెద్ద నష్టం అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంకు ఊహించని విధంగా చీల్చగలిగే సత్తా షర్మిల కి ఉంది.

అంతే కాకుండా వైసీపీ లో ఆమెకి ఎంతో మంది సన్నిహితులు ఉన్నారు. ఆంధ్ర పాలిటిక్స్ లో అడుగుపెడితే కచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లో చేరే అవకాశం ఉంది.

తద్వారా ఎవ్వరూ ఊహించని పరిణామాలు త్వరలోనే చోటు చేసుకోబోతున్నాయి అని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు.