ఆ మూవీ చూస్తున్నంతసేపు గూజ్ బంబ్సే.. కమల్ హాసన్ ప్రశంసలు..!

0
294

కమల్ హాసన్ విలక్షణ నటుడిగా రాష్ర్టం కాదు కాదు.. దేశం వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఒక్కో సినిమా ఒక్కో స్టయిల్ లో ఉంటుంది. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వైవిధ్య భరితమైన చిత్రాలను ఎంచుకొని మరీ తన నటనతో ప్రతి ఒక్కరినీ మెప్పించారు. హీరో, విలన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ వెండితెరపై అన్ని ప్రముఖ రోల్స్ ను ఆయన పోషించారు. ఆయన తాజాగా శంకర్ డైరెక్షన్ లో ‘భారతీయుడు-2’లో నటిస్తున్నారు.

పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్

కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి తీసిన కాంతారా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ సాధించింది. బాహుబలి, కేజీఎఫ్ లాంటి మూవీస్ కలెక్షన్లను తక్కువ సమయంలో తాగి ఔరా అనిపించుకుంది. బాలీవుడ్ సైతం ముక్కున వేలేసుకుందంటే సందేహం లేదు. ఇప్పటి వరకూ చాలా వరకు స్టార్ హీరోలు రిషబ్ ను అభినందించారు. ఈ జాబితాలోకి తాజాగా కమల్ హాసన్ కూడా చేరారు.

తనను బాగా ఆకట్టుకుందట

ఈ మూవీని కమల్ హాసన్ శుక్రవారం (నవంబర్ 18న) చూశారంట. ఈ చిత్రం తనను బాగా ఆకట్టుకుందట. మేకింగ్ గుడ్ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు కమల్. ముఖ్యంగా దేవ కోలా ఘట్టాలు ఆయనను మరో లోకంలోకి తీసుకెళ్లాయట. ఇలాంటి సినిమాలనే ప్రేక్షకులు కోరుకుంటున్నారని అందుకే పాన్ ఇండియా లెవల్ లో ఆకట్టుకుందని చెప్పాడు. యంగ్ డైరెక్టర్ వైవిద్యమైన కథలను ఎంచుకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని చెప్పుకచ్చారు కమల్ హాసన్.