మహేష్‌ చేస్తున్న రెండో రిస్కీ మూవీ అది

0
391
mahesh babu

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు తన జాగా చిత్రం ‘గుంటూరు కారం’ విజయంతో మంచి జోష్‌ మీద ఉన్నాడు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ప్రారంభంలో మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ దాన్ని అధిగమించి రికార్డు కలెక్షన్‌లు రాబట్టింది.

గతంలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మహేష్‌ల కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో అతడు హిట్‌ చిత్రంగా నిలవగా, ఖలేజా మాత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. విశేషం ఏమంటే.. ఈ రెండు సినిమాలు బుల్లితెరపై మాత్రం టాప్‌ రేటింగ్‌ తెచ్చుకున్నాయి.

మహేష్‌ తదుపరి చేయబోయే సినిమా ‘ఎస్‌ఎస్‌ఎంబి`29’. ఇండియన్‌ టాప్‌మోస్ట్‌ డైరెక్టర్‌లలో ఒకరైన ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఈ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ నిర్మాత కె.యల్‌. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

mahesh babu

దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఆయన మళ్లీ నిర్మాణం చేపట్టడం విశేషం. ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఆ చిత్రం భారీ వ్యయంతో రూపొందనుంది. ఈ చిత్రం కోసం ఇప్పటికే హైదరాబాద్‌ శివారులో భారీ సెట్స్‌ వేస్తున్నారు. అలాగే రామోజీ ఫిల్మ్‌సిటీలో కూడా సెట్స్‌ వేస్తున్నారు.

ఇప్పటికే సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరాల కార్యక్రమం మొదలు పెట్టేశారట. కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ సూపర్‌ బ్యాంగ్‌లతో ఆద్యంతం ఔరా అనిపించే విధంగా కథను రూపొందించారని తెలుస్తోంది.

కథే ఔరా అనిపిస్తే ఇక రాజమౌళి తన దర్శక ప్రతిభతో సినిమాను ఏ రేంజ్‌కు తీసుకువెళతారో మనం ఊహించు కోవచ్చు.

ఇంట్రస్టింగ్‌ విషయం ఏమిటంటే మహేష్‌బాబు ఇప్పటి వరకూ చేసిన 28 సినిమాలలో బాగా కష్టపడి చేసిన సినిమాగా ‘టక్కరి దొంగ’కు పేరుంది. దీనికి జయంత్‌ సి. పరాన్జీ దర్శకుడు. ఇది కూడా పూర్తి అడ్వంచర్‌ చిత్రం.

దాదాపు అవుట్‌డోర్‌లోనే చేశారు. ఆ సినిమా తర్వాత మళ్లీ మహేష్‌ అంతగా కష్టపడి చేయబోయే సినిమా ఈ ఎస్‌.ఎస్‌.ఎం.బి`29. కష్టపడటం అంటే భౌతికంగా అనేక రిస్కీ షాట్స్‌తో బాడీని హూనం చేసుకోవడం అన్నమాట. ఆ సినిమా మహేష్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

చాలాకాలం తర్వాత మళ్లీ మహేష్‌ ఈ చిత్రం కోసం బల్క్‌ డేట్స్‌ కేటాయించి, దేశ, విదేశాల్లో షూటింగ్‌ చేయటానికి సిద్ధం కావడంతో మహేష్‌ చేస్తున్న రెండో రిస్కీ సినిమాగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.